Short News

పాక్ సుప్రీం జడ్జి ఇంటిపై కాల్పులు

పాక్ సుప్రీం జడ్జి ఇంటిపై కాల్పులు

పాకిస్థాన్ అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ ఇజాజ్ ఉల్ అహసాన్ నివాసంపై ఆదివారం కాల్పులు జరిగాయి. అయితే రెండు దఫాలు జరిగిన కాల్పుల్లో జస్టిస్ అహసాన్ సురక్షితంగా ఈ దాడుల నుండి బయటపడ్డారు.పాకిస్థాన్ సుప్రీం కోర్టుకు సమాచార సంబంధాల శాఖ అధికారులు ఈ మేరకు మీడియాకు ఇచ్చిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం నాలుగున్నర గంటలకు, ఉదయం 9 గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయని ప్రకటించారు.పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మియాన్ నకిబ్ నిసార్ తక్షణమే జస్టిస్ సకిబ్ నిసార్ తక్షణమే నివాసానికి వెళ్ళి పరామర్శించారు.

లక్ష్మీనారాయణ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు?...

లక్ష్మీనారాయణ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు?...

గుంటూరు:హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు...రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదంటున్నారు...కానీ వ్యవసాయ శాఖ మంత్రిని అయితే రైతుల కోసం ఏం చేయవచ్చో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నానన్నారు...ఒకవేళ వ్యవసాయ మంత్రిని కాకుంటే సామాజికవేత్తగా మారి ఏం చెయ్యాలో చూస్తానన్నారు... సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ చేసిన, చేస్తున్న వ్యాఖ్యలివి. అయితే ఈ వ్యాఖ్యలు చూస్తుంటే సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణకు అసలు ఏం చెయ్యాలో స్పష్టత లేదా?...

రిలయన్స్ జియోలో కొత్తగా 80 వేల ఉద్యోగాలు

రిలయన్స్ జియోలో కొత్తగా 80 వేల ఉద్యోగాలు

దేశీయ టెలికం మార్కెట్‌లో రిలయన్స్ జియో పెను సంచలనం సృష్టించింది. 2018-19లో 80 వేల మంది కొత్త ఉద్యోగులను చేర్చుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ఛీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సంజయ్ జోగ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం జియోలో సుమారు 1.57 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, కొత్తగా మరో 75 వేల నుంచి 80 వేల మందిని చేర్చుకోవాలని భావిస్తున్నట్లుగా వెల్లడించారు.
మీ ఆరోగ్యానికి ఈ కృత్రిమమైన స్వీటెనర్లు చాలా డేంజర్ !

మీ ఆరోగ్యానికి ఈ కృత్రిమమైన స్వీటెనర్లు చాలా డేంజర్ !

మీరు డైట్ సోడాను ఇష్టపడే వారైతే, ఇది మీకు చెడు వార్త కావచ్చు. కృత్రిమ స్వీటెనర్లతో తయారుచేసిన తక్కువ కేలరీలు గల పానీయాలు & స్నాక్స్ మీకు మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్యాలను కలుగజేసే అవకాశం ఉందని ఒక కొత్త అధ్యాయనంలో నిర్ధారించబడింది. వాటితో పాటు గుండె జబ్బుల వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా కావచ్చు. ఈ వ్యాసం ద్వారా మనము కృత్రిమ స్వీటెనర్ల వల్ల కలిగే ప్రమాదాల గూర్చి పూర్తిగా తెలుసుకోబోతున్నాం.

కృత్రిమ స్వీటెనర్ల వల్ల కలిగే ప్రమాదాలను నమోదు చేశారు.