Short News

భారత గణతంత్ర వేడుకలకై ట్రంప్‌కు ఆహ్వానం

భారత గణతంత్ర వేడుకలకై ట్రంప్‌కు ఆహ్వానం

2019 రిపబ్లిక్‌ డే వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఆహ్వానించినట్లు సమాచారం. భారత ప్రభుత్వం ఏప్రిల్‌లోనే ట్రంప్‌కు ఆహ్వానం పంపించిందని, దీనిపై ట్రంప్‌ యంత్రాంగం సానుకూలంగా స్పందించిందని తెలుస్తోంది. గత గణతంత్ర దినోత్సవ వేడుకలకు పది ఏషియాన్‌ దేశాల ప్రతినిధులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ భారత్‌ ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైతే ఈ వేడుకకు హాజరైన రెండో అమెరికా అధ్యక్షుడు అవుతారు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా రిపబ్లిక్‌ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇంగ్లండ్ పై  టెస్ట్ సిరీస్ గెలిస్తే..కోహ్లీ ఖతాలో సరికొత్త రికార్డు.!

ఇంగ్లండ్ పై టెస్ట్ సిరీస్ గెలిస్తే..కోహ్లీ ఖతాలో సరికొత్త రికార్డు.!

టెస్ట్‌ల్లో వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తున్నది. వచ్చే నెల 1న ఇంగ్లండ్‌తో మొదలయ్యే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో విజయం సాధిస్తే దిగ్గజాలు అజిత్ వాడేకర్, కపిల్‌దేవ్, రాహుల్ ద్రవిడ్ సరసన కోహ్లీ చోటు దక్కించుకుంటాడు. 1971లో తొలిసారి మూడు టెస్ట్‌ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 1-0తో గెలిచింది. ఆ తర్వాత హర్యానా హారికేన్ కపిల్‌దేవ్ కెప్టెన్సీలో భారత్ 1986లో ఇంగ్లండ్ జట్టుపై సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది. సౌరవ్ గంగూలీ, ధోనీకి సాధ్యం కాని అరుదైన రికార్డును విరాట్ అందుకుంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది.
చెన్నైలో కుప్పకూలిన భవనం..ఒకరు  మృతి

చెన్నైలో కుప్పకూలిన భవనం..ఒకరు మృతి

చెన్నైలో నిర్మాణంలో ఉన్న భవనంలోని ఓ భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. 28 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి కండంచవాడి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్నది ఆసుపత్రి అని, ఐరన్ గిడ్డర్లు కూలడంతో 28 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.సమాచారం అందుకున్న వెంటనే 8 అంబులెన్సులు, 3 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్టు చెప్పారు.
మీరేమన్నారో చూడండి!: బాబుకు పవన్ దిమ్మతిరిగే షాక్

మీరేమన్నారో చూడండి!: బాబుకు పవన్ దిమ్మతిరిగే షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పర్యటిస్తున్నారు. ఉదయం పది గంటలకు ఉండవల్లి గుహలను సందర్శించి, ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇదిలా ఉండగా ప్రత్యేక హోదా కోసం జనసేన తిరుపతిలో, కాకినాడలో గళం విప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ వాదం ఇలా ఉందంటూ పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం ఆనాటి పత్రికలను పోస్టు చేశారు. అందులో చంద్రబాబు హోదాపై చెప్పిన వ్యాఖ్యలు ఉన్నాయి. హోదాతో ఏం వస్తుందని, హోదాతో ఒరిగేదేం లేదని, హోదా అంటే జైలుకేనని చంద్రబాబు నాడు పేర్కొన్నట్లుగా పత్రికల్లో వచ్చిన వాటిని పోస్ట్ చేశారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more