Short News

గేదెను ముద్దు పెట్టుకున్న చిరుత ఇది!

గేదెను ముద్దు పెట్టుకున్న చిరుత ఇది!

చిరుత పులి గేదెను ముద్దు పెట్టుకోవ‌డం మీరెప్పుడైనా చూశారా.. లేక‌పోతే ఈ ఫొటో చూడండి. ద‌క్షిణాఫ్రికాలోని స‌బీ ఎడారి ప్రాంతంలో ఇది చోటుచేసుకుంది. ఉద‌యాన్నే చ‌క్క‌ని మాంసాహారం కోసం ఎదురుచూస్తున్న ఈ చిరుత‌కు ఆఫ్రిక‌న్ గేదె పిల్ల క‌నిపించింది. కానీ తీరా తిన‌డానికి చూస్తే దాంతో పాటు పెద్ద గేదెల మంద క‌నిపించింది. ఇంతలో ఏం జ‌రిగిందో చిరుత పులి ఆ గేదె పిల్ల‌ను ముద్దు పెట్టుకున్న‌ట్లు న‌టించి చెట్టుపైనే ఉండిపోయింది. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. 'ఇది అరుదైన దృశ్య‌మ‌ని' నేష‌న‌ల్ జియోగ్రాఫిక్ ఛాన‌ల్ వ్యాఖ్యానించింది.
రూ.98కే రోజుకు 1.5 జీబీ డేటా అంటున్న బీఎస్ఎన్ఎల్‌

రూ.98కే రోజుకు 1.5 జీబీ డేటా అంటున్న బీఎస్ఎన్ఎల్‌

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. డేటా సునామీ ఆఫర్ కింద రూ.98కే ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. దీంట్లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు వాలిడిటీని 26 రోజులుగా నిర్ణయించారు. అంటే మొత్తం 26 రోజులకు గాను 39 జీబీ డేటా వినియోగదారులకు లభిస్తుంది. ఈ క్రమంలో 1 జీబీ డేటా ఖరీదు కేవలం రూ.2.51 మాత్రమే అవుతుంది. జియో, ఎయిర్‌టెల్‌లతో పోలిస్తే తక్కువ ధరకే బీఎస్‌ఎన్‌ఎల్ రూ.98 ప్లాన్ లభిస్తుండడం విశేషం.   
రెండు నిమిషాల ప‌రుగుతో ఎముక‌లు దృఢం

రెండు నిమిషాల ప‌రుగుతో ఎముక‌లు దృఢం

వయస్సు మీద పడుతున్నకొద్దీ స్త్రీలలో ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుందన్న సంగతి తెలిసిందే! ఎముకలు పూర్వ ఆరోగ్యం సంతరించుకోవడానికి ప్రతి రోజూ రెండు నిమిషాలు పరుగు తీయడం లేదా జిమ్‌లో బరువులెత్తడం చేస్తే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. సుమారు 2500 మంది స్త్రీల మీద వీరు సుదీర్ఘ అధ్యయనం నిర్వహించారు. వీరిలో కొందరి చేత ప్రతి రోజూ రెండు నిమిషాల పాటు పరుగు, జిమ్‌లో బరువులెత్తించడం చేశారు. మిగతావారిని మామూలుగా నడవమన్నారు. కొన్ని రోజుల తరువాత వీరి ఆరోగ్యాన్ని పరిశీలించగా పరుగుతీసిన స్త్రీలలో ఎముకల ఆరోగ్యం మునుపటికన్నా మెరుగు పడటం గుర్తించారు.     
ఢిల్లీ ఘన విజయం..టోర్నీనుంచి ముంబై ఔట్

ఢిల్లీ ఘన విజయం..టోర్నీనుంచి ముంబై ఔట్

టీ20లీగ్ 2018లో భాగంగా పుణే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 11 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ గెలిచింది. సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ పోరాటం లీగ్‌ దశలోనే ముగిసింది. బ్యాట్స్ మెన్స్ పేలవ ప్రదర్శనతో సొంతగడ్డపై 163 పరుగులకే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఫలితంగా మరోసారి ప్లేఆఫ్‌కు చేరాలన్న ముంబై ఇండియన్స్‌ లక్ష్యం నెరవేరలేదు. అంతకుముందు ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ జట్టు 174 పరుగులు చేసింది. రిషబ్ పంత్ ఆఫ్ సెంచరీ సాధించాడు.