Short News

భార్య చిత్రపటాన్ని చూసిన ఒబామా ఏమన్నారంటే..

భార్య చిత్రపటాన్ని చూసిన ఒబామా ఏమన్నారంటే..

అమెరికా అధ్యక్షుల చిత్రపటాలను ప్రదర్శనకు ఉంచే స్మిత్‌ సోనియన్‌ నేషనల్‌ పోట్రెయిట్‌ గ్యాలరీలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ఆయన సతీమణి మిషెల్‌ ఒబామాల చిత్రపటాలను ఆవిష్కరించారు. ఈ చిత్రపటాలను ప్రముఖ చిత్రకారులు కెహిండే విలే, అమీ షెరాల్డ్‌ గీసారు. ఈ కార్యక్రమానికి ఒబామా, మిషెల్‌ హాజరయ్యారు. అయితే తన భార్యను అందంగా చూపించినందుకు చిత్రకారిణి అమీ షెరాల్డ్‌ను ఒబామా అభినందించారు.
మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

నితిన్ నటిస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో చల్ మోహన్ రంగ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజగా చిత్ర యూనిట్ ఆహ్లాదకరమైన మెలోడీ సాంగ్ ని విడుదల చేసింది. నితిన్, హీరోయిన్ మేఘ ఆకాష్ మధ్య సంభాషణతో ఈ సాంగ్ ప్రారంభం అవుతుంది. ఈ సాంగ్ చాలా అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. సంగీతం వినసొంపుగా ఉంటూ పాట వెంటనే నచ్చేసేలా ఉంది. తమన్ జోరు చూస్తుంటే మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఛల్ మోహన్ రంగ చిత్ర రూపంలో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20 లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమేనని భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో ముక్కోణపు టీ20 టోర్నీ ఆడనుండటంపై స్పందించాడు. మరోవైపు మూడో మ్యాచ్‌లో గెలిచి టీమిండియా టీ20 సిరీస్‌ సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసాడు. మనీష్‌ పాండే, హర్ధిక్‌ పాండ్యలు భారత జట్టులో సెహ్వాగ్‌, హర్భజన్‌లా జట్టులో కీలక ఆటగాళ్ళుగా మారడానికి సమయం పడుతుందన్నాడు.
అబ్బాయ్ డైరెక్టర్ తో బాలయ్య..వివి వినాయక్ నో.. దుమ్ము దుమారమే!

అబ్బాయ్ డైరెక్టర్ తో బాలయ్య..వివి వినాయక్ నో.. దుమ్ము దుమారమే!

జై సింహా చిత్రం విజయం సాధించడంతో బాలయ్య మంచి జోరు మీద ఉన్నాడు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించాల్సి ఉంది. తేజ ఈ చిత్రానికి దర్శకుడు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్ లో బాలయ్యతో ఓ సినిమా చేయాలని జై సింహా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడిని బాలయ్యతో సినిమా కోసం ఒప్పించే ప్రయత్నం జరుగుతోంది. ప్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కు పటాస్ చిత్రంతో అనిల్ సూపర్ హిట్ ఇచ్చాడు.