Short News

స్వగ్రామాల బాట పట్టిన చైనీయులు ..ఎందుకంటే.!

స్వగ్రామాల బాట పట్టిన చైనీయులు ..ఎందుకంటే.!

చైనా నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కోట్లాది మంది ప్రజలు స్వస్థలాల బాట పట్టడంతో విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు జనంతో కిటకిటలాడుతున్నాయి. ఈ నెల 16న వసంతోత్సవం జరుపుకోనున్న ప్రజల ప్రయాణ సౌకర్యాల కల్పనకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఈ సీజన్‌లో అన్ని వాహనాలు కలిపి ఏకంగా 298 కోట్ల ట్రిప్పులు వేయాల్సి ఉంటుందని అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద సీజన్‌ వలస ఇదే.
సబర్మతీ ఆశ్రమంలో కెనడా ప్రధాని

సబర్మతీ ఆశ్రమంలో కెనడా ప్రధాని

భారత పర్యటనలో ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. గుజరాతీ సంప్రదాయ దుస్తులు ధరించి భార్య సోఫీ, పిల్లలు జేవియర్‌, హడ్రియెన్‌, ఎల్లా గ్రేస్‌తో కలిసి ఆశ్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ట్రూడో, ఆయన భార్య సోఫీ చరఖా తిప్పారు. అనంతరం గాంధీనగర్‌లోని అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. భారత్‌లో ఏడు రోజుల అధికారిక పర్యటన కోసం ట్రూడో శనివారం ఢిల్లీకి వచ్చారు.
ఎయిర్‌ ఏసియా టికెట్లపై 20శాతం డిస్కౌంట్‌ సేల్‌

ఎయిర్‌ ఏసియా టికెట్లపై 20శాతం డిస్కౌంట్‌ సేల్‌

విమానయాన సం‍స్థ ఎయిర్‌ ఏసియా మరోసారి డిస్కౌంట్‌ ఆఫర్ తెచ్చింది. స్పెషల్‌ ప్రమోషన్‌ పథకం కింద 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్‌ ఫిబ్రవరి 25తో ముగియనుంది. మొబిక్విక్‌ ద్వారా మరో 15శాతం తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఈ తగ్గింపు వర్తిస్తుందని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్‌ ద్వారా 2018 ఫిబ్రవరి 25నుంచి 28వరకూ దేశీయ ప్రయాణం చేయవచ్చు.
టీ20 ఫార్మాట్‌పై క్రికెట్‌ కోచ్‌ అసహనం

టీ20 ఫార్మాట్‌పై క్రికెట్‌ కోచ్‌ అసహనం

టీ 20 ఫార్మాట్‌ పై ఇంగ్లండ్‌ క్రికెట్‌ ప్రధాన కోచ్‌ ట్రేవర్‌ బేలీస్‌ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసాడు. అంతర్జాతీయ టీ20లను అంతర్జాతీయ షెడ్యూల్‌ నుంచి తొలగిస్తే మంచిదంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఆదివారం న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ముగిసిన తర్వాత మాట్లాడుతూ ట్వంటీ 20 ఫార్మాట్‌ను ఫ్రాంచైజీల గేమ్‌గా చూడాలన్నాడు. ఐపీఎల్‌, బీబీఎల్‌ మాదిరి దేశవాళీ మ్యాచ్‌లకే టీ20 క్రికెట్‌ను పరిమితం చేయాలన్నాడు.