Short News

ఆ పట్టణానికి అన్నీ 'ఆవిడే'

ఆ పట్టణానికి అన్నీ 'ఆవిడే'

అమెరికా నెబ్రాస్కా రాష్ట్రంలోని మోనావి అనే పట్టణంలో ఎల్సీ ఐలర్‌ అనే మహిళ పదివరకు ఉద్యోగాలు చేస్తోంది. అక్కడ ఉండే ఏకైక పౌరురాలు ఎల్సీనే కావటంతో మేయర్‌, క్లర్క్‌, లైబ్రేరియన్‌, కోశాధికారి, బార్‌టెండర్‌ అన్నీ ఆవిడే. 2010 లెక్కల ప్రకారం అక్కడ ఆమె ఒక్కరే నివసిస్తున్నారు. 1930ల్లో మోనావిలో దాదాపు నూటాయాభై మంది వరకు జనం ఉండేవారు. రెండో ప్రపంచయుద్ధసమయంలో వలసలు మొదలై పట్టణం ఖాళీ అయ్యింది. తన చివరిరోజు వరకూ అలాగే గడుపుతానంటోంది ఎల్సీ.
భర్త చనిపోయాక మరో వ్యక్తితో సహజీవనం

భర్త చనిపోయాక మరో వ్యక్తితో సహజీవనం

రెండేళ్ళుగా సహజీవనం చేస్తూ వివాహం చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడిని ప్రియురాలు హత్య చేసింది. అయితే ఈ కేసులో ప్రియురాలు పాత్ర నిర్ధారణ కావడంతో పూణె సిటీ సెషన్స్ కోర్టు నిందితురాలికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. సహజీవనం చేస్తున్న హనుమంతును వివాహం చేసుకోవాలని ప్రియురాలు సరిత కోరింది. అయితే అప్పటికే వివాహమై పిల్లలున్నా హనుమంతు నిరాకరించడంతో దీంతో సరిత హనుమంతును హత్యచేసింది. ఈ కేసులో సరితకు కోర్టు జీవిత ఖైదును విధించింది.

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

మేఘ అస్సలు ఊరుకోవడం లేదుగా..నితిన్ ని ఎలా బెదరగొడుతోందో విన్నారా..లిరికల్ సాంగ్!

నితిన్ నటిస్తున్న మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ కావడంతో చల్ మోహన్ రంగ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజగా చిత్ర యూనిట్ ఆహ్లాదకరమైన మెలోడీ సాంగ్ ని విడుదల చేసింది. నితిన్, హీరోయిన్ మేఘ ఆకాష్ మధ్య సంభాషణతో ఈ సాంగ్ ప్రారంభం అవుతుంది. ఈ సాంగ్ చాలా అందంగా ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. సంగీతం వినసొంపుగా ఉంటూ పాట వెంటనే నచ్చేసేలా ఉంది. తమన్ జోరు చూస్తుంటే మరో సూపర్ హిట్ ఆల్బమ్ ఛల్ మోహన్ రంగ చిత్ర రూపంలో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20లు లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమే

టీ20 లేకుంటే క్రికెట్‌ మనుగడ కష్టమేనని భారత మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ అన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో ముక్కోణపు టీ20 టోర్నీ ఆడనుండటంపై స్పందించాడు. మరోవైపు మూడో మ్యాచ్‌లో గెలిచి టీమిండియా టీ20 సిరీస్‌ సొంతం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేసాడు. మనీష్‌ పాండే, హర్ధిక్‌ పాండ్యలు భారత జట్టులో సెహ్వాగ్‌, హర్భజన్‌లా జట్టులో కీలక ఆటగాళ్ళుగా మారడానికి సమయం పడుతుందన్నాడు.