Short News

మళ్లీ స్వదేశానికి నవాజ్,మరియం.. రాగానే అరెస్ట్ చేస్తాం

మళ్లీ స్వదేశానికి నవాజ్,మరియం.. రాగానే అరెస్ట్ చేస్తాం

అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కు పదేళ్ల శిక్ష పడిన సంగతి విదితమే.కోర్టు తీర్పు వెల్లడించిన సమయంలో ఆయన లండన్‌లో ఉన్నారు. అయితే ఆయన మళ్లీ స్వదేశానికి తిరిగి వస్తున్నారు. షరీఫ్ కూతురు మరియం కూడా పాక్‌కు వస్తున్నారు. శుక్రవారం లాహోర్ చేరుకుంటారు. అల్లామా ఇక్బాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు రాగానే ఆ ఇద్దర్నీ అరెస్టు చేస్తామని. వారు విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోదాదాపు పది వేల మంది అదనపు బలగాలతో పాటు వారిని జైలుకు తరలించేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌ను సిద్ధం చేశారు.
రైల్వే గ‌రీబ్ ర‌థ్ ఛార్జీలకు రెక్క‌లు!

రైల్వే గ‌రీబ్ ర‌థ్ ఛార్జీలకు రెక్క‌లు!

పేదవారి ఏసీ ట్రైన్‌ గరీబ్‌ రథ్‌ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలూ భారం కానున్నాయి. పదేళ్ల కిందట రూ. 25గా నిర్ణయించిన బెడ్ రోల్ ధరను సవరించాలని రైల్వేలు నిర్ణయించాయి. గత కొన్నేళ్లుగా లినెన్‌ ధర పెరిగినప్పటికీ గరీబ్‌ రథ్‌ రైళ్లలో ప్రయాణీకులకు అందించే దుప్పట్ల ధరను టికెట్‌ రేటులో కలపలేదు. అయితే తాజాగా ఈ ధరల భారాన్ని గరీబ్‌ రథ్ ఛార్జీలను పెంచడం ద్వారా కొంతమేర భర్తీ చేయాలని భావిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. బెడ్ రోల్‌ ధరలను రైలు ఛార్జీల్లో కలపాలని కాగ్‌ కోరిన మీదట ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తున్నామని చెప్పారు.   
జాన్వీ ఇప్ప‌టికే స్టార్ అయిపోయింది!

జాన్వీ ఇప్ప‌టికే స్టార్ అయిపోయింది!

బాలీవుడ్‌ అగ్ర నటుడు అనిల్‌ కపూర్ తన సోదరుడు బోనీ కపూర్‌ కుమార్తె జాన్వీని ప్రశంసించారు. ఆమె కథానాయికగా నటించిన తొలి సినిమా ‘ధఢక్‌'. ఈ సినిమాను శనివారం రాత్రి చూశానని అనిల్‌ తెలిపారు. చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. ‘జాన్వీ, ఇషాన్‌ ఇప్పటికే స్టార్స్‌ అయిపోయారు. వారి అమాయకత్వం, ప్రేమ మీ హృదయాల్ని కచ్చితంగా దోచుకుంటుంది. నాకు ఈ చిత్రం చాలా నచ్చింది' అని పేర్కొన్నారు.నటి సోనమ్‌ కపూర్‌ కూడా తన సోదరిని అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘ఎంత అద్భుతమైన అరంగేట్రం జాన్వీ. మాటలు సరిపోవడం లేదు' అని రాశారు.‌   
కొండ చ‌రియ‌లు ప‌డి 7 మంది దుర్మ‌ర‌ణం

కొండ చ‌రియ‌లు ప‌డి 7 మంది దుర్మ‌ర‌ణం

జ‌మ్ము క‌శ్మీర్‌లోని రెయిసీ జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కొండ చరియలు విరిగిపడి ఏడుగురు మృతి చెందగా, 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శాయిరీబాబా జలపాతం వద్ద చోటు చేసుకుంది. సాయంత్రం 3:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. చీనాబ్ నదిపైన 466 మీటర్ల ఎత్తుపై ఉన్న ఈ జలపాతం టూరిస్ట్‌లను ఆకట్టుకుంటుంది. పోలీసులు, మిలటరీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.   
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more