Short News

పెళ్లి వేడుక ''మెరిసింది''.. అన్నీ బంగారు వ‌స్తువులే మ‌రి!

పెళ్లి వేడుక ''మెరిసింది''.. అన్నీ బంగారు వ‌స్తువులే మ‌రి!

పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లి వీడియో ఇప్పడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. పెళ్లి కొడుకు బంగారంతో చేసిన‌ టై, షూ ధ‌రించి వేడుక‌లో పాల్గొన‌డ‌మే ఇందుకు కార‌ణం. లాహోర్‌కు చెందిన హఫీజ్‌ సల్మాన్‌ షాహిద్‌ పెద్ద వ్యాపార వేత్త. తన పెళ్లి అందరూ చెప్పుకునే విధంగా ఘ‌నంగా ఉండాలని భావించాడు. అనుకున్నదే తడవుగా లక్షలు పెట్టి బంగారు షూ, టై, సూట్ తయారు చేయించాడు.  అద‌నంగా రూ. 25 లక్షలు పెట్టి పెళ్లి వస్తువులను డిజైన్‌ చేయించుకున్నాడు. వాటికి కాపలాగా భద్రతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకోవ‌డం విశేషం.   
'ఎవెంజర్స్‌' కోసం ఒక్కరోజులో 50 వేల టికెట్లు తెగాయి

'ఎవెంజర్స్‌' కోసం ఒక్కరోజులో 50 వేల టికెట్లు తెగాయి

హాలీవుడ్‌ యాక్షన్‌ చిత్రం 'ఎవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్' ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కాబోతోంది. ఈ చిత్రం భారత్‌లో 2000 తెరలపై విడుదల కాబోతోంది. ఐమ్యాక్స్‌ త్రీడీలో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారట. బుక్ ‌మై షోలో ఆదివారం ప్రీ బుకింగ్స్‌ను తెరవడంతో ఒక్కరోజులోనే 50 వేల టికెట్లు అమ్ముడపోయాయి. ఈ చిత్రం ఆంగ్లం, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. దాదాపు 400 మిలియన్‌ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రాబర్ట్‌ డౌనీ, క్రిస్‌ పాట్‌, క్రిస్‌ ఇవాన్స్‌, జోష్‌ బ్రోలిన్‌ ప్రధాన పాత్రలు పోషించారు.  
ఆరు నెల‌ల్లో 22 ల‌క్ష‌ల కొత్త ఉద్యోగులు నియామ‌కం

ఆరు నెల‌ల్లో 22 ల‌క్ష‌ల కొత్త ఉద్యోగులు నియామ‌కం

దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని మోదీ సర్కార్‌పై విపక్షాలు, విమర్శకులు విరుచుకుపడుతున్న వేళ ప్రభుత్వానికి తీపి కబురు అందింది. గత ఆరు నెలల్లో ( ఫిబ్రవరి 28 వరకూ) దేశంలో దాదాపు 22 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయని ఈపీఎఫ్‌ఓ, ఎన్‌పీఎస్‌లు జారీ చేసిన తాజా పేరోల్‌ జాబితా వెల్లడించింది. 3.5 లక్షల మంది కేంద్ర ఇతర ప్రభుత్వ ఉద్యోగులు నూతన ఖాతాలు తెరిచారని ఈ రెండింటినీ కలుపుకుని దేశంలో కొత్తగా 22 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయని తేలింది. గత ఆరునెలల్లో ఈఎస్‌ఐసీ కొత్తగా 18-25 సంవత్సరాల వయసున్న 8.3 లక్షల మందికి బీమా కల్పించినట్టు ప్రకటించింది.   
గుంటూరు:చిన్నారులపై కాక్సికా వైరస్ దాడి...

గుంటూరు:చిన్నారులపై కాక్సికా వైరస్ దాడి...

గుంటూరు:ఇటీవలే కలరా బారిన పడి కుదేలైన గుంటూరు నగరంలో తాజాగా కాక్సికా వైరస్ వణుకు పుట్టిస్తోంది. అయితే ఇది చిన్నారులపై దాడి చేసే వైరస్ కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గుంటూరు జిల్లాలో 5 నెలల వ్యవధిలో 56 మంది చిన్నారులు ఈ వైరస్‌ బారిన పడినట్లు వైద్య వర్గాలు వెల్లడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రధానంగా ఏడేళ్ల లోపు చిన్నారులపై మీదే ప్రతాపం చూపించే ఈ వైరస్ కారణంగా చేతులు, కాళ్లు, ముఖంపై తీవ్ర దద్దుర్లు లేదా బొబ్బలు కనిపిస్తాయి.