Short News

ద‌క్షిణాఫ్రికాలో గాంధీ వాక్ కు విశేష స్పంద‌న‌

ద‌క్షిణాఫ్రికాలో గాంధీ వాక్ కు విశేష స్పంద‌న‌

ద‌క్షిణాఫ్రికాలోని లెనాసియాలో ఇవాళ జ‌రిగిన 33వ వార్షిక గాంధీ వాక్ లో వంద‌లాది మంది పాల్గొన్నారు. దాదాపు 12 కిలోమీటర్లు సాగిన ఈ కార్య‌క్ర‌మంలో రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోస, జోహన్నెస్‌బర్గ్ కాన్సులేట్ జనరల్ కేజే శ్రీనివాస,తెలంగాణ సౌత్ ఆఫ్రికా అసోసియేషన్(టాసా) ప్ర‌తినిధులు పాల్గొన్నారు. గాంధీ వేష‌ధారి ఆక‌ట్టుకున్నారు. ప‌చ్చ‌ద‌నం పెంచ‌డం ద్వారా వాతావ‌ర‌ణ మార్పుల నుంచి ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించాల‌నేది ఈ ఏడాది గాంధీ వాక్ ముఖ్య ఉద్దేశమ‌ని నిర్వాహ‌కులు పేర్కొన్నారు.    
షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

షాకింగ్.. 40 కేజీల డ్రెస్ వేసుకున్న రజనీకాంత్.. 2.0 లో అదే హైలైట్!

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా మరో మారు వాయిదా పడి జూన్ 7 న విడుదలకు సిద్ధం అవుతోంది. రజనీకాంత్ నటించిన మరో చిత్రం 2.0 కూడా విడుదల కావలసి ఉంది. 2.0 పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు. కాగా ఈ చిత్రంలో రజనీకాంత్ కీలకమైన స్టంట్స్ కోసం 40 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారట.శంకర్ ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టారని, చిత్రం త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు.

విమానంలో విరిగిన విండో ప్యానెల్, ముగ్గురికి తీవ్ర గాయాలు

విమానంలో విరిగిన విండో ప్యానెల్, ముగ్గురికి తీవ్ర గాయాలు

ఎయిరిండియా బోయింగ్ విమానం ప్రయాణికులను బెంబెల్లెత్తించింది. విమానంలోని విండో ప్యానెల్ విరిగి ప్రయాణికులపై పడడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు.15 నిమిషాల పాటు ప్రయాణికులు భయంతో వణికిపోయారు. అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ఢిల్లీలో ల్యాండైన వెంటనే గాయపడిన ముగ్గురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. ఓవర్ హెడ్ ప్యానెల్‌కు తల బలంగా తాకిన ప్రయాణికుడికి కుట్లు పడినట్టు చెప్పారు.
మైనర్‌పై డాక్టర్ రేప్,కేసు

మైనర్‌పై డాక్టర్ రేప్,కేసు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ డాక్టర్ దారుణానికి పాల్పడ్డారు. ఒంటరిగా చికిత్స కోసం వచ్చిన బాలికపై డాక్టర్ అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకొంది. చికిత్స కోసం వెళ్ళిన బాలిక రెండు రోజులుగా ఇంటికి రాలేదు. రెండు రోజుల తర్వాత ఆమె ఇంటికి చేరుకొంది.మత్తులో ఉన్న పరిస్థితిలోనే బాలిక ఇంటికి చేరుకొంది. బాలిక పరిస్థితిపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే బాలికకు మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు ప్రకటించారు.