Short News

కెమికల్ ఫ్యాక్టరీలో ఏడు పేలుళ్లు.. 19 మంది దుర్మరణం

కెమికల్ ఫ్యాక్టరీలో ఏడు పేలుళ్లు.. 19 మంది దుర్మరణం

చైనాలోని చెంగ్డులోని యిబిన్‌ హెంగ్డా టెక్నాలజీ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రసాయనిక కర్మాగారంలో ఈ పేలుడు జరిగింది. పది నిమిషాల వ్యవధిలోనే ఏడు పేలుళ్ల శబ్దాలు విన్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు మీడియాకు వెల్లడించారు. పేలుడు ధాటికి కర్మాగారం పక్కనే ఉన్న భవనాల అద్దాలు పగిలిపోయాయి.
మమతా బెనర్జి వల్లనే షమీని అరెస్ట్ చేయడంలేదు

మమతా బెనర్జి వల్లనే షమీని అరెస్ట్ చేయడంలేదు

పశ్చిమబెంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే భారత క్రికెటర్‌ మహమ్మద్‌ షమిని పోలీసులు అరెస్టు చేయడంలేదని ఆరోపించింది షమి భార్య హసీన్‌ జహాన్‌. పోలీసులు నాకు రక్షణ కల్పిస్తున్నారు కానీ మద్దతు ఇవ్వడం లేదు. వారంతా షమికే మద్దతుగా నిలిచారు' అని అన్నారు. అనంతరం బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి పిచ్చివాడి నుంచా మీరు ఆశిస్తోంది?' అని ప్రశ్నించింది.
వివాదంలో తాప్సీ నటించిన ‘ముల్క్’... దర్శకుడి ఓపెన్ లెటర్!
<iframe width="600" height="450" src="https://www.youtube.com/embed/1MjC30zo1KA" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

వివాదంలో తాప్సీ నటించిన ‘ముల్క్’... దర్శకుడి ఓపెన్ లెటర్!

రిషి కపూర్, ప్రీతీక్ బబ్బర్, రజత్ కపూర్, తాప్సీ ముఖ్యపాత్రల్లో అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'ముల్క్' వివాదంలో ఇరుక్కుంది. నేర చరిత గల ముస్లిం కుటుంబాలకు సపోర్టుగా ఈ సినిమా ఉందని, దీని వెనక ఎవరు ఉన్నారో? అంటూ కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించడంతో దర్శకుడు అనుభవ్ సిన్హా ఓపెన్ లెటర్ రాశారు. ముల్క్‌' సినిమాకు దావూద్‌ ఇబ్రహీం గానీ, కాంగ్రెస్‌ పార్టీగానీ, లేదా ఆరెస్సెస్‌ గానీ డబ్బులు సమకూర్చడం లేదన్నారు. ఆగస్టు 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

2020లో అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ నేనే

2020లో అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ నేనే

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండోసారి మళ్లీ తాను అధ్యక్షుడిని కాబోతున్నట్టు తేల్చి చెప్పారు. అంతేకాదు, ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీలో తనకు పోటీ ఇవ్వగలిగే నేతే లేరని పేర్కొన్నారు. ‘నిజానికి డెమొక్రటిక్ పార్టీలో సరైన అభ్యర్థే లేరు'' అని ‘మెయిల్' కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు డెమొక్రటిక్ పార్టీలో తనను ఎదిరించగలిగే వ్యక్తి ఒక్కరు కూడా లేరని పేర్కొన్నారు. ‘‘నాకైతే ఎవరూ కనిపించడం లేదు. నాకు వారందరూ తెలుసు. కానీ, నాకెవరూ కనిపించడం లేదు'' అని ట్రంప్ పేర్కొన్నారు.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more