Short News

సైన్యానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంచలన ఆదేశాలు!

సైన్యానికి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడి సంచలన ఆదేశాలు!

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టె మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టు మహిళా గెరిల్లాలను వారి మర్మాంగాల్లో కాల్చి చంపాలంటూ తన సైనికులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. గత వారంలో కొంతమంది మాజీ తిరుగుబాటుదారులను ఉద్దేశించి రోడ్రిగో ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యానించినట్లు వాషిగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. 'సైనికులకు చెప్పండి, మేయర్ నుంచి ఓ కొత్త ఆదేశం వస్తోందని.. మేం మిమ్మల్ని చంపం, జస్ట్ మీ మర్మాంగంలో కాలుస్తాం..' అంటూ రోడ్రిగో డ్యుటెర్టె వ్యాఖ్యానించారు.

తగ్గని తొలిప్రేమ జోష్ .. దూసుకెళ్తున్న వరుణ్ కలెక్షన్ల గ్రాఫ్

తగ్గని తొలిప్రేమ జోష్ .. దూసుకెళ్తున్న వరుణ్ కలెక్షన్ల గ్రాఫ్

ఓవర్సీస్ మార్కెట్‌లో టాలీవుడ్ చిత్రాలు తొలిప్రేమ దుమ్మురేపుతున్నది. తొలి ప్రేమ ఒక మిలియన్ డాలర్ల మార్కును అధిగమించింది. ఇక తొలిప్రేమ తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. అమెరికాతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి విశేష స్పందన లభిస్తుండటం విశేషం. తొలిప్రేమ చిత్రం మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఇప్పటికే రెండోవారంలోకి ప్రవేశించింది.

నేను రాలేను. కమల్ కు కేటీఆర్ ట్వీట్

నేను రాలేను. కమల్ కు కేటీఆర్ ట్వీట్

మ‌ధురైలో ఈ రోజు జ‌రుగ‌నున్న‌ త‌న‌ రాజ‌కీయ పార్టీ ఆవిర్భావ స‌భ‌కు క‌మ‌ల్ హాస‌న్‌ ప‌లువురు ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించారు. తెలంగాణ మంత్రి కేటీయార్‌ను కూడా ఆహ్వానించారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల రాలేక‌పోతున్నానని క‌మ‌ల్ కు చెప్పేశారు కేటీఆర్‌. కొత్త ఇన్నింగ్స్‌లోనూ మీరు రాణించాల‌ని కోరుకుంటున్నాన‌న్నారు. మీ రాజ‌కీయ అరంగేట్ర కార్య‌క్ర‌మానికి ఆహ్వానించినందుకు మీకు ధ‌న్య‌వాదాలు అంటూ చెప్పారు కేటీఆర్.
గీతాంజలి జెమ్స్ షేరు కుదేలు ..రూ.419కోట్ల నష్టం

గీతాంజలి జెమ్స్ షేరు కుదేలు ..రూ.419కోట్ల నష్టం

నేటి ట్రేడింగ్ లో ప్రముఖ వజ్రాభరణాల సంస్థ 'గీతాంజలి జెమ్స్' షేర్లు భారీగా కుదేలయ్యాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థ షేర్లు ఆరు రోజుల్లో 56శాతం నష్టపోయాయి. దీంతో ఆ కంపెనీకి రూ.419కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈరోజు బీఎస్‌‌ఈలో గీతాంజలి షేర్‌ విలువ రూ.27.45 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో రూ.27.40 వద్ద ట్రేడవుతోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి.