Short News

అమెరికాలో మంచు తుపాను బీభ‌త్సం

అమెరికాలో మంచు తుపాను బీభ‌త్సం

తుపాను ప్రభావంతో మధ్య అమెరికా ప్రాంతంలో వడగళ్ల వానలు కురిశాయి. తుపాను ధాటికి శనివారం రెండేళ్ల చిన్నారి సహా ముగ్గురు మరణించారు. వందల విమానాల రాక‌పోక‌లు రద్దయ్యాయి. రోడ్లపై 35 సెంటీ మీటర్ల ఎత్తుమేర మంచు పేరుకుపోయింది. మిషిగన్, విస్కాన్సిన్, ఇల్లినాయిస్, లూసియానా, ఆర్కాన్సస్, టెక్సస్‌ తదితర రాష్ట్రాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో జ‌న జీవ‌నం స్తంభించింది.   
రెవెన్యూ ఉద్యోగులకు శుభవార్త

రెవెన్యూ ఉద్యోగులకు శుభవార్త

రాష్ట్ర రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త వినిపించింది. భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ పూర్తి చేసినందుకు గానూ సీఎం కేసీఆర్.. ఒక నెల మూలవేతనాన్ని రెవెన్యూ సిబ్బంది ప్రోత్సాహకంగా అందుకోనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రోత్సాహకాలు ప్రకటించడంపై రెవెన్యూ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెవెన్యూ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.
రూ.లక్ష కోట్లతో ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ డీల్‌ ..వచ్చేవారమే.!

రూ.లక్ష కోట్లతో ఫ్లిప్‌కార్ట్‌, వాల్‌మార్ట్‌ డీల్‌ ..వచ్చేవారమే.!

గత కొంతకాలంగా ఫ్లిప్‌కార్ట్‌లో మెజారిటీ వాటాను వాల్‌మార్ట్‌ సొంతం చేసుకోనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డీల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో రెండు సంస్థల మధ్య ఒప్పందం జరగొచ్చని సమాచారం. ఈ ఒప్పందం విలువ 18 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1.19లక్షల కోట్లు. ఫ్లిప్‌కార్ట్‌లో 51శాతం, అంతకంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్‌ చర్చలు జరుపుతోంది. డీల్‌ దాదాపు పూర్తయ్యిందని, మే మొదటి వారంలో దీనిపై స్పష్టత వస్తుందని కూడా అంటున్నారు.
అబూసలేం పెరోల్ దరఖాస్తు తిరస్కరణ

అబూసలేం పెరోల్ దరఖాస్తు తిరస్కరణ

బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ అబూసలేం రెండో పెళ్లి కోసం పెట్టుకున్న పెరోల్ దరఖాస్తును నవీ ముంబై పోలీసు కమిషనర్ తిరస్కరించారు. 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు. ఈ కేసులో కీలక దోషి అయిన అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న అబూ సలేం తాజాగా తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తనకు 45రోజుల పాటు పెరోల్ ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే పెరోల్ దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు.