Short News

అతడి దొంగతనం తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు

అతడి దొంగతనం తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు

షట్టర్ తాళం పగుల కొట్టి,లేదా గోడలు దూకి దొంగతనం చేస్తుంటారని తెలుసు. కానీ ఆ యువకుడు షాపు షెట్టరు పగలకొట్టడం.. గోడలు దూకకుండా దొంగతనం చేశాడు. ఈ ఘటన దక్షిణ చైనాలో ఈ నెల 13న చోటుచేసుకుంది. అతను షాపు ముందు నెలపై పడుకున్నాడు. షట్టర్‌ను మెల్లిగా తన చేతులతో పైకి నెడుతూ, తన శరీరాన్ని గట్టిగా ఒత్తుకుంటు.. చిన్నగా షాపులోకి ప్రవేశించాడు. షాపులోకి వెళ్లగానే ఏ మాత్రం అలస్యం చేయకుండా అలారమ్‌ ఆఫ్‌ చేశాడు. తెలివిగా విలువైన అభరణాలను మాత్రమే దొంగిలించాడు.   
అత్యధిక పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌

అత్యధిక పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌

ఢిల్లీ డేర్‌డేవిల్స్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌గా గుర్తింపు పొందాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్‌ హాఫ్‌ సెంచరీ చేసి సరికొత్త రికార్డు సాధించాడు.. ఇప్పటి వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వికెట్‌ కీపర్‌ రాబిన్‌ ఊతప్ప 660 పరుగుల ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగగా.. తాజాగా పంత్‌ అధిగమించాడు. ఈ సీజన్‌లోనే ముగ్గురు వికెట్‌ కీపర్‌లు( పంత్‌,రాహుల్‌, బట్లర్‌) అత్యధిక పరుగులు సాధించడం విశేషం.
ఢిల్లీపై ముంబై విజయ లక్ష్యం 175

ఢిల్లీపై ముంబై విజయ లక్ష్యం 175

టీ20లీగ్ 2018లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 175 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ 38 పరుగులకే ఓపెనర్లు పృథ్వీషా(12), మ్యాక్స్‌వెల్‌ వికెట్లను కోల్పోయింది. రిషబ్‌ పంత్‌(64;44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), విజయ్‌ శంకర్‌(43 నాటౌట్‌; 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు)ల మెరుపులకు తోడు మ్యాక్స్‌వెల్‌(22) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది.
ధోని,కోహ్లీ ఇద్దరిలో ఒకరినే ఎంపిక చేసుకుంటా

ధోని,కోహ్లీ ఇద్దరిలో ఒకరినే ఎంపిక చేసుకుంటా

శనివారం ఉప్పల్‌లో జరిగిన కోల్‌కతా-సన్‌రైజర్స్‌ మ్యాచ్‌కు సింధు హాజరై సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మ్యాచ్‌ మధ్యలో సింధూ మాట్లాడుతూ.. సన్‌రైజర్స్‌ అద్భుతంగా రాణిస్తుందని, తాను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇక్కడ మ్యాచ్‌లు లేవని, కానీ అన్ని సన్‌ మ్యాచ్‌లను ఫాలో అయినట్లు తెలిపారు. డబుల్స్‌ పార్టనర్‌గా ఏ క్రికెటర్‌ను ఎంపిక చేసుకుంటారన్న ప్రశ్నకు.. మాజీ కెప్టెన్‌ ధోని, ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిలలో ఒకరిని ఎంపిక చేసుకుంటానన్నారు.