Short News

జీతాన్ని విరాళమిచ్చిన ట్రంప్

జీతాన్ని విరాళమిచ్చిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి జీతాన్ని విరాళంగా ఇచ్చారు. 2017 సంవత్సరంలో నాలుగో త్రైమాసిక వేతనాన్ని అమెరికా రవాణా విభాగానికి అందజేసారు. ఈ మేరకు రవాణా విభాగం కార్యదర్శి ఎలైన్‌ చావోకు లక్ష డాలర్ల చెక్‌ పంపించారు. ఇటీవల రోడ్లు, వంతెనలు, పోర్టులను పునఃనిర్మించాలని ప్రణాళికలు విడుదల చేసిన నేపథ్యంలో ఆ విభాగం అభివృద్ధి కోసం సహాయం అందించారు. అమెరికా అధ్యక్షుడి జీతం ఏడాదికి 4లక్షల డాలర్లు.
దిసీజ్ మై పెర్ఫార్మెన్స్.. ఎనీ డౌట్స్: మంత్రి లోకేష్

దిసీజ్ మై పెర్ఫార్మెన్స్.. ఎనీ డౌట్స్: మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రిగా తన పనితీరు విషయంలో ఎలాంటి సందేహాలు, అనుమానాలు అవసరం లేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన తాను ఐటీ శాఖ మంత్రి అయిన తరువాత రాష్ట్రానికి అనేక కంపెనీలు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా తన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద కామెంట్స్ చేసిన బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజుకు ఘాటుగా కౌంటర్ ఇస్తూనే ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు కూడా లోకేష్ చురకలు అంటించారు.

రూ.1,394 కోట్ల యూబీఐ స్కాం: ‘టొటెం’ కంపెనీ డైరెక్టర్లు అరెస్

రూ.1,394 కోట్ల యూబీఐ స్కాం: ‘టొటెం’ కంపెనీ డైరెక్టర్లు అరెస్

వందల కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ సంస్థ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, కవితలను బెంగళూరులో అరెస్టు చేసినట్టు సమాచారం. మొత్తం 8 బ్యాంకుల కన్సార్టియంను రూ.1394 కోట్ల మేరకు టొటెం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మోసగించింది. హైదరాబాద్ లోని యూనియన్ బ్యాంకును రూ.313.84 కోట్ల మేరకు సదరు సంస్థ మోసగించింది. ఈ మేరకు యూనియన్ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ డైరెక్టర్లు ఇద్దరు, మరికొందరిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

కారుబాంబు పేలుడు: 12 మంది మృతి

కారుబాంబు పేలుడు: 12 మంది మృతి

దక్షిణ ఆఫ్గనిస్థాన్‌లోని లష్కర్గా పట్టణంలో శుక్రవారం కారుబాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మృత్యువాతపడగా, మరో 40 మందికి పైగా గాయాలైనట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. హెల్మెండ్‌ ప్రావిన్స్‌లోని ఘాజీ మహమ్మద్ ఆయూబ్ ఖాన్ క్రీడా మైదానానికి సమీపంలో ఈ బాంబు పేలుడు సంభవించింది. మరోవైపు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు, ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆసుపత్రి వర్గాల సమాచారం.