Short News

భారత్ పై  ట్రంపు కు కోపమొచ్చింది.

భారత్ పై ట్రంపు కు కోపమొచ్చింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపు భారత్ పై గుర్రుగా ఉన్నారు.అమెరికాకు చెందిన హర్లీడేవిడ్ సన్ మోటార్ సైకిళ్ల దిగుమతిపై భారత్‌ అధిక సుంకం వసూలు చేస్తోందని అసంతృప్తి వ్యక్తంచేశారు. అంతేకాదు భారత్‌ నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే మోటార్‌సైకిళ్లపైనా సుంకాన్ని పెంచుతామని హెచ్చరించారు. ఇటీవల భారత ప్రభుత్వం హార్లీడేవిడ్‌సన్‌ బైక్‌లపై టారిఫ్‌ను 75శాతం నుంచి 50శాతానికి తగ్గించింది. కానీ ఇది సరిపోదని పెదవి విరిచారు. ఇరు వైపులా ఒకేలా సుంకాలు చెల్లించేలా‘రెసిప్రోకల్‌ ట్యాక్స్‌' విధానం ఉండాలన్నారు.
అక్క‌డ నిర‌స‌న‌ల‌పై మిర‌ప కాయ బాంబులు వేయ‌బోతున్నారా?

అక్క‌డ నిర‌స‌న‌ల‌పై మిర‌ప కాయ బాంబులు వేయ‌బోతున్నారా?

కశ్మీరులో సైనిక దళాలపై రాళ్ళు విసిరే మూకలకు గుణపాఠం చెప్పేందుకు పారా మిలిటరీ దళాలు అనేక అంశాలను పరిశీలిస్తున్నాయి. పెల్లెట్ గన్స్ వాడ‌కంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైన‌ నేపథ్యంలో బాష్ప వాయు గోళాలు, మిరపకాయ బాంబులను ప్రయోగించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బాష్పవాయు గోళాలపై ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వీటిని సున్నితమైన ప్లాస్టిక్‌తో తయారు చేశారు. వీటిని ప్రయోగించినపుడు నిరసనకారులకు తీవ్రమైన గాయాలు తగిలే అవకాశం ఉండదు. మిరపకాయ బాంబులను ప్రస్తుతం కశ్మీరులో ప‌రిశీలిస్తున్నారు. 
రూ.200 కోట్ల క్లబ్ లో ‘రంగస్థలం’

రూ.200 కోట్ల క్లబ్ లో ‘రంగస్థలం’

రాంచరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన చిత్రం రంగస్థలం. ఈసినిమా కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. గత నెల 30న విడుదలైన ఈ సినిమా మ‌రో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. ఓవైపు భరత్ అనే నేను రీలీజై మంచి టాక్ తో నడుస్తున్నా.. రంగస్థలం మాత్రం కలెక్షన్ల వసూళ్లలో దూసుకుపోతుంది. రామ్ చరణ్ సినిమాలన్నింటిలోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
అన్ని కుట్ర‌లకు గ‌వ‌ర్న‌రే సూత్ర‌ధార‌ట‌!

అన్ని కుట్ర‌లకు గ‌వ‌ర్న‌రే సూత్ర‌ధార‌ట‌!

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌పై రాష్ట్ర మంత్రి నక్కా ఆనంద్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ వ్యవహారంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గవర్నర్ వ్యవస్థను తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నామన్నారు. రాజకీయ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం ఏమిటని ప్రశ్నించారు. అన్ని కుట్రల్లోనూ గవర్నర్ సూత్రధారిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోదీ-‌షా కేంద్రంగా జరుగుతున్న కుట్రలు, కుతంత్రాల్లో గవర్నర్ పాత్రధారిగా ఉంటున్నారని మంత్రి ఆరోపించారు.