Short News

ట్రం‌ప్‌కు షాక్: సిరియాపై దాడులు చేస్తే ఊరుకోం:పుతిన్

ట్రం‌ప్‌కు షాక్: సిరియాపై దాడులు చేస్తే ఊరుకోం:పుతిన్

సిరియాపై అమెరికా దాడులకు తెగబడుతున్న తరుణంలో రష్యా మరోసారి అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది.సిరియాపై మరోసారి దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఆంక్షలు విధిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.సిరియాపై ఆంక్షలు విధిస్తే చూస్తూ ఊరుకోబోమని రష్యా హెచ్చరించింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం నాడు ప్రకటనను విడుదల చేశారు. అయితే ఆంక్షల విషయంలో అమెరికా మాత్రం వెనక్కు తగ్గే పరిస్థితులు కన్పించడం లేదు.

'అనూ'తో అల్లు అర్జున్ పర్సనల్ 'సెల్ఫీ'

'అనూ'తో అల్లు అర్జున్ పర్సనల్ 'సెల్ఫీ'

అల్లు అర్జున్‌ నటిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య'. రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 4న రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ బుధవారంతో పూర్తయ్యింది. ఈ సందర్భంగా బన్నీ ట్వీట్‌ చేస్తూ 'నా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ అడిగిన తొలి, చివరి కోరిక ఓ సెల్పీ, షూటింగ్‌ పూర్తయిన తరువాత అనుతో నా తొలి పర్సనల్‌ ఫొటో' అంటూ ఫోటో షేర్ చేసుకున్నాడు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్‌-శేఖర్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమా ఆడియో ఆదివారం విడుదల కానుంది. 
సముద్రంలో దెయ్యపు చెప కన్పించిందట!

సముద్రంలో దెయ్యపు చెప కన్పించిందట!

సముద్రంలో వేల అడుగుల లోతులో పరిశోధకులకు వింతజీవికన్పించిందట.ఎన్‌ఓఏఏ ఒకియనోస్‌ ఎక్స్‌ప్లోరర్‌ సంస్థ పరిశోధకులకు సముద్రం లోతుల్లోకి వెళ్లి అధ్యాయనం చేస్తున్న వారికి అచ్చూ డెవిల్‌ ఫిష్‌లాంటి జీవి మరొకటి కనిపించి ఆశ్చర్యపర్చింది. మెక్సికో తీరంలో ఓ స్క్విడ్‌ ఎరుపు రంగులో డెవిల్‌ ఫిష్‌లా కనిపించడంతో పరిశోధకులు విస్తుపోయారు. దాన్ని కొందరు దెయ్యపు చేపగా పిలువగా పరిశోధకులు మాత్రం ఇప్పటివరకూ ఎలాంటి పేరు పెట్టలేదు.
డివిలియర్స్ లా నేను ఆడలేను

డివిలియర్స్ లా నేను ఆడలేను

ప్రస్తుతం క్రికెట్ లో ప్రపంచ మేటి బ్యాట్స్‌మన్‌ ఎవరు.? ఈ చర్చ వచ్చినపుడల్లా విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. వీరిద్దరికీ మూడు ఫార్మాట్లలోనూ వీరికి తిరుగులేని రికార్డుంది. ఐతే డివిలియర్స్‌లా తాను అన్ని రకాల షాట్లు ఆడలేనని కోహ్లి అంటున్నాడు. 'నేను సంప్రదాయ షాట్లకే పరిమితమవుతాను. ఏబీలా సృజనాత్మక షాట్లు నాకు సాధ్యం కావు. ఏబీ తరహా నైపుణ్యం నాకు లేదు. ఆ షాట్లను నేనెప్పుడూ సాధన కూడా చేయలేదు. ఫాస్ట్‌బౌలర్‌ బౌలింగ్‌లో బంతిని రివర్స్‌ స్వీప్‌ చేసి సిక్స్‌ బాదగల నైపుణ్యం ఏబీ సొంతం' అన్నాడు.