Short News

ప్రకాశవంతమైన చర్మ సౌందర్యానికై బాదం ఫేస్ పాక్

ప్రకాశవంతమైన చర్మ సౌందర్యానికై బాదం ఫేస్ పాక్

చర్మ సంరక్షణ కోసంగా మనం అనేక వ్యాసాలు ఇదివరకే చదివున్నాం. తద్వారా చర్మ నిగారింపు మరియు సంరక్షణా పద్దతుల గురించిన అవగాహన ఖచ్చితంగా ఉంటుంది. రిఫరెన్స్ కోసం మా పేజీలో ప్రచురించిన వ్యాసాలపై ఒక లుక్కేయండి. కానీ అన్నిటినీ ఫాలో అవ్వాలా అనే ప్రశ్నకు కాదనే సమాధానం ఉంటుంది. అవసరాన్ని ఉద్దేశించి, చర్మ విధానాన్ని అనుసరించి ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. మీకు ఏమాత్రం సమయం ఉన్నా ఇంటిపద్దతులనే అనుసరించడం మేలు. అనేకులు, ఈ సమయాన్ని కేటాయించలేక సెలూన్లపై ఆధారపడుతున్నారు.

శ్రీదేవి మరణం ఎంతో నేర్పించింది

శ్రీదేవి మరణం ఎంతో నేర్పించింది

అందాల తార శ్రీదేవి హఠాన్మరణం తనలో వ్యక్తిగతంగా మార్పు తీసుకొచ్చిందని అగ్ర కథానాయకుడు నాగార్జున అన్నారు. 'ఆఫీసర్‌' చిత్ర ప్రచారంలో భాగంగా ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడారు. శ్రీదేవి మరణం జీవిత పాఠం నేర్పిందని పేర్కొన్నారు. 'ఆమె మరణించారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. జీవితం అనూహ్యమైంది. ఆమె హఠాన్మరణం నా ప్రియమైన వారిని మరింత ప్రశంసించేలా, వారికి ఇంకా దగ్గరయ్యేలా చేసింది. ప్రతి క్షణాన్ని పాజిటీవ్‌గా, అందంగా గడపడం చాలా ముఖ్యం. ఆమె నైపుణ్యం, వృత్తి జీవితంలో హుందాతనాన్ని నేను చూసాను. శ్రీదేవి ఏదైనా సాధించగల నటి' ఆన్నారు.
రషీద్ మ్యాజిక్ ..ఫైనల్లో హైదరాబాద్

రషీద్ మ్యాజిక్ ..ఫైనల్లో హైదరాబాద్

టీ20 లీగ్‌ తాజా సీజన్‌లో హైదరాబాద్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక‍్రవారం కోల్‌కతాతో జరిగిన క్వాలిఫయర్‌-2లో 13 పరుగుల తేడాతో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది.రషీద్‌ ఖాన్‌ మూడు వికెట్లతో కీలక పాత్ర పోషించగా, సిద్ధార్థ్‌ కౌల్‌, బ్రాత్‌వైట్‌లు తలో రెండు వికెట్లు తీసారు. ఆదివారం చెన్నైతో హైదరాబాద్‌ అమీతుమీ పోరులో తలపడనుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు 174 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతా 9 వికెట్ల కోల్పోయి 161 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. 
'నా నువ్వే’ విడుదల మరింత ఆలస్యం

'నా నువ్వే’ విడుదల మరింత ఆలస్యం

నందమూరి కల్యాణ్ రామ్‌ నటిస్తున్న చిత్రం 'నా నువ్వే'. జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లో తమన్నా హీరోయిన్‌. ఈ సినిమాను మే 25న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేయగా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో విడుదల వాయిదా పడింది. జూన్‌ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్రాన్ని జూన్‌ 8న లేదా 14న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. గ్రాఫిక్స్‌ వర్క్‌ పూర్తి కాని కారణంగానే విడుదల ఆలస్యమవుతుందని తెలుస్తోంది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more