Short News

వెల్లుల్లి మరియు నిమ్మని వాడటం ద్వారా గోర్లను దృఢంగా మార్చుకోవచ్చా?

వెల్లుల్లి మరియు నిమ్మని వాడటం ద్వారా గోర్లను దృఢంగా మార్చుకోవచ్చా?

మనందరికీ సాధారణంగా వంటింట్లో లభ్యమయ్యే వెల్లుల్లి మరియు నిమ్మ ద్వారా కలిగే ఆరోగ్యప్రయోజనాలపై అవగాహన ఉంది. అయితే, ఈ రెండిటినీ కలపడం ద్వారా గోర్లు దృఢంగా మారతాయన్న విషయం మీకు తెలుసా? అవును, మీరు చదివింది నిజమే!

వెల్లుల్లి మరియు నిమ్మలో గోర్ల సంరక్షణకు తోడ్పడే మినరల్స్ సమృద్ధిగా లభ్యమవుతాయి. ఇవి బలహీనమైన గోర్లు చిట్లకుండా రక్షిస్తాయి. గోర్లను దృఢంగా మార్చుతాయి. అలాగే, ఈ పదార్థాల వలన ఎల్లో నెయిల్స్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

అమ్మని బ్రతికించడం కోసమే స్మగ్లింగ్.. జబర్దస్ కమెడియన్ హరి కన్నీటి గాధ, భారీ కుట్రలో ఇరుక్కుపోయి!

అమ్మని బ్రతికించడం కోసమే స్మగ్లింగ్.. జబర్దస్ కమెడియన్ హరి కన్నీటి గాధ, భారీ కుట్రలో ఇరుక్కుపోయి!


చాలా క్లిష్ట పరిస్థితుల్లో తాను ఎర్రచందనం స్మగ్లింగ్ చేయవలసి వచ్చిందని బుల్లితెర హాస్య నటుడు హరి తెలిపాడు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎదుట లొంగిపోయిన తరువాత హరి మీడియాతో తన కన్నీటి గాదని వివరించాడు. తాను గతంలో ఏం చేసేవాడిని, స్మగ్లింగ్ ఎందుకు చేయవలసి వచ్చింది, తనపై జరిగిన కుట్రలు వంటి విషయాలు హరి మీడియాకు వివరించాడు. తాను స్మగ్లింగ్ మానేసిన తరువాత కూడా శ్రీనివాసులు రెడ్డి ఓ ఎస్సైతో కలసి స్మగ్లిండ్ కొనసాగించాడు.

యూఎస్ ఓపెన్ ప్రైజ్ మ‌నీ భారీగా పెంపు

యూఎస్ ఓపెన్ ప్రైజ్ మ‌నీ భారీగా పెంపు

యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ సింగిల్స్‌ టైటిల్‌ గెలిస్తే 38 లక్షల డాలర్లు (రూ.26 కోట్లు) ఎగరేసుకుపోవచ్చు. నిర్వాహకులు విజేతలకు ఈ ఏడాది ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల చరిత్రలో ఇదే అత్యధిక ప్రైజ్‌మనీ కావడం విశేషం. కేవలం మెయిన్‌ ‘డ్రా'కు అర్హత సాధిస్తే చాలు 54 వేల డాలర్లు (రూ. 37 లక్షలు) సొంతమవుతాయి. మొత్తం టోర్నీ ప్రైజ్‌మనీ విలువ 5 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 363 కోట్లు). ఇది మొన్న సాకర్‌ విజేతకు ఇచ్చిన ప్రైజ్‌మనీ కంటే ఎక్కువ! వచ్చే నెల 27న మొదలయ్యే ఈ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి ఈ ఏడాది స్వర్ణోత్సవ వేడుక కానుంది.    
మాన్సూన్ అప్‌డేట్: రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు

మాన్సూన్ అప్‌డేట్: రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు

తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఉత్తరాఖండ్, హర్యానా, ఛండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులు, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, కర్ణాటక తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులపై గంటకు 35-45కి.మీ వేగంతో విపరీతమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవుల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more