Short News

అక్కడఅమ్మాయిలు,ఫేక్ బాయ్ ఫ్రెండ్స్ అద్దెకు తెచ్చుకుంటున్నారు

అక్కడఅమ్మాయిలు,ఫేక్ బాయ్ ఫ్రెండ్స్ అద్దెకు తెచ్చుకుంటున్నారు

వివాహం చేసుకున్న ప్రతి అమ్మాయి జీవితము ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. పెళ్లి చేసుకునే పిల్లలతో స్థిరపడటమే ప్రతి అమ్మాయి కోరుకునే అందమైన కలల ప్రపంచంగా చెప్పవచ్చు.

కానీ చైనా దేశంలోని పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి, వాటిలోని కొన్ని మార్పులు ప్రపంచాన్ని ఎంత సరళంగా మారుస్తున్నాయో అనేదానిపై రుజువులను కూడా కలిగి ఉంది. ప్రచారంలో ఉన్న కథలు :-ఇక్కడ మేము, ఫేక్ బాయ్ ఫ్రెండ్స్ను అద్దెకి తెచ్చుకోవటం అనే విషయం గురించి తెలియ చేయబోతున్నాము.

వైరల్ గా రాం చరణ్, ఎన్టీఆర్ ఫొటో

వైరల్ గా రాం చరణ్, ఎన్టీఆర్ ఫొటో

నటుడు రామ్‌చరణ్‌.. తారక్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వైరల్ గా మారింది. చరణ్, ఎన్టీఆర్ ను వెనక నుంచి పట్టుకుని సరదాగా ఆటపట్టిస్తున్నట్లు ఉన్న ఫొటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు సోదరా! ఈ ఏడాది నీకు అద్భుతంగా ఉండాలి' అని చరణ్‌ పోస్ట్ చేశారు.‌ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రాంచరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
న్యూయార్క్‌ పోలీస్‌గా తొలిసారి  సిక్కు మహిళ

న్యూయార్క్‌ పోలీస్‌గా తొలిసారి సిక్కు మహిళ

గురుశోచ్‌ కౌర్‌ అనే సిక్కు మహిళ తొలిసారిగా అరుదైన ఘనత సాధించారు. తలపాగా ధరించిన ఓ సిక్కు మహిళ మొదటిసారిగా న్యూయార్క్‌ పోలీస్‌ విభాగంలో చేరనున్నారు. న్యూయార్క్‌ సిటీ పోలీస్‌ అకాడమీలో గతవారం డిగ్రీ పూర్తి చేసుకున్న ఆమె పోలీసు సహాయక అధికారిణిగా న్యూయార్క్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరనున్నారు. యూఎస్‌ ప్రజలు సిక్కిజాన్ని అర్థం చేసుకునే విధంగా గురుశోచ్‌ కౌర్‌ మార్పుతేవాలని ‘మినిష్టర్‌ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌' హరదీప్‌ సింగ్‌ పూరి కోరారు.
పాకిస్తాన్ లో హిందూ  ఆలయానికి రూ 2 కోట్లు కేటాయింపు

పాకిస్తాన్ లో హిందూ ఆలయానికి రూ 2 కోట్లు కేటాయింపు

పాకిస్తాన్ లో హిందూ ఆలయానికి భారీగా నిధులు కేటాయించారు. రావల్పిండి సిటీలోని పురాతన కృష్ణుడి దేవాలయాన్ని వైభవంగా తీర్చిదిద్దేందుకు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం రూ.2కోట్లు విడుదల చేసింది. పండుగల సమయంలో, ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భాల్లో హిందువులు అత్యధిక మంది దర్శనం కోసం వచ్చినప్పటికీ ఇబ్బందులు కలగకుండా ఆలయాన్ని పునరుద్ధరించనున్నారు. ఇస్లామాబాద్, రావల్పిండి జంట నగరాల్లో పూజలందుకుంటున్న ఏకైక హిందూ ఆలయం కృష్ణ దేవాలయం మాత్రమే కావడం విశేషం.