Short News

అందమైన పెదవుల కోసం దాల్చిన మరియు షుగర్ తో DIY లిప్ స్క్రబ్

అందమైన పెదవుల కోసం దాల్చిన మరియు షుగర్ తో DIY లిప్ స్క్రబ్

బిజీ లైఫ్ స్టయిల్, పర్యావరణ కాలుష్యం, కఠినమైన వాతావరణ పరిస్థితులు మరియు కాస్మెటిక్స్ ను ఎక్కువగా వాడటం వంటివి పెదాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. పెదాలు డల్ గా డార్క్ గా అలాగే పగిలినట్టుగా మారతాయి. మాయిశ్చర్ కోల్పోతాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి. లేదంటే దీర్ఘకాల సమస్యలు వేధిస్తాయి.

మృదువైన, అందమైన పెదవులను కలిగి ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి? వివిధ లిప్ ట్రీట్మెంట్స్ ద్వారా అందమైన పెదవులను పొందటం సులభం కాదు.

'జైరా వ‌సీమ్' తల్లిగా ప్రియాంక చోప్రా

'జైరా వ‌సీమ్' తల్లిగా ప్రియాంక చోప్రా

క్వాంటికో టెలివిజన్ సిరీస్ తో హాలీవుడ్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా కొంత విరామం తర్వాత బాలీవుడ్‌లో నటిస్తోంది. స‌ల్మాన్ స‌ర‌స‌న భార‌త్ అనే చిత్రం చేస్తున్న ఈ భామ సోనాలి బోస్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక చిత్రాన్ని అంగీకరించింది. 'ఇమ్యునోడెఫిషియన్సీ' వ్యాధితో మృతి చెందిన 18 ఏళ్ళ అయేషా చౌద‌రి జీవిత నేప‌థ్యంలో రూపొంద‌నున్న చిత్రంలో అయేషాగా జైరా వ‌సీమ్ న‌టించ‌నుండగా, ఆమె త‌ల్లి పాత్ర‌లో ప్రియాంక చోప్రా న‌టిస్తుందని సమాచారం. ప్రియాంక భ‌ర్తగా అభిషేక్ బ‌చ్చ‌న్ నటించే అవకాశాలున్నాయి.  పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
తొలి ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్

తొలి ఏసీ బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ నగరంలో మంగళవారం తొలి ఏసీ బస్ షెల్టర్ అందుబాటులోకి వచ్చింది. మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంగళవారం ఉదయం అయ్యప్ప సొసైటీ వద్ద జలమండలి ఆధ్వర్యంలో నిర్మించిన రిజర్వాయర్‌ను ఆయన కేటీఆర్ ప్రారంభించారు. శిల్పా రామం ఎదురుగా నిర్మించిన ఆధునిక ఏసీ బస్ షెల్టర్‌ను ఆయన ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ఏసీ బస్టాప్‌ను ఏర్పాటు చేసి జీహెచ్‌ఎంసీ అరుదైన ఘనత సాధించింది.

రాజకీయ నేపథ్య చిత్రంతో నమిత రీ-ఎంట్రీ.!

రాజకీయ నేపథ్య చిత్రంతో నమిత రీ-ఎంట్రీ.!

నటి నమిత 'ఎంగల్‌ అన్నా' చిత్రంతో తమిళతెరకు పరిచయమై కొన్నేళ్ళ పాటు అగ్ర నాయికగా కొనసాగారు. చెన్నైలో సెటిల్‌ అయిన అమ్మడికి  అవకాశాలు తగ్గటంతో గతేడాది నిర్మాతను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. సినిమాలకు గుడ్ బై చెప్పిందని భావిస్తున్న తరుణంలో త్వరలో మరోసారి కథానాయికగా కనిపించనున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ దర్శకుడు టి.రాజేందర్‌ స్వీయ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో నమిత ప్రతినాయకిగా నటించనున్నట్లు సమాచారం. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.