Short News

బాసిల్ (లేదా) తులసి మీ బరువును తగ్గించడానికి సహాయపడుతుందా ?

బాసిల్ (లేదా) తులసి మీ బరువును తగ్గించడానికి సహాయపడుతుందా ?

"ప్లాంట్ ఫుడ్స్ ఫర్ హ్యూమన్ న్యూట్రిషన్" అని ప్రచురించినబడిన పత్రికా కథనం ప్రకారం, బాసిల్ అనే హెర్బ్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను, కొవ్వు స్థాయిలను తగ్గించి వచ్చని సూచించింది.

భారత్లో చేపట్టిన అధ్యయనం ప్రకారం, బాసిల్ను మీ ఆహారంలో తప్పకుండా తీసుకోవడం వల్ల మీలో ఉన్న ఒత్తిడిని తగ్గించడానికి ఇది అత్యంత సురక్షితమైన, ప్రభావంతమైన మార్గంగా చూపించబడింది. అంతేకాకుండా, జ్వరాన్ని తగ్గించడంలోనూ, జీర్ణశక్తిని పెంపొందించడంలోనూ,

కళ్యాణ్‌ను చూడటం మానేశాను: ‘విజేత’ విజయోత్సవంలో అల్లు అర్జున్ కామెంట్స్

కళ్యాణ్‌ను చూడటం మానేశాను: ‘విజేత’ విజయోత్సవంలో అల్లు అర్జున్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కథానాయకుడిగా రాకేష్ శశి దర్శకత్వంలో వారాహి చలనచిత్రం పతాకంపై నిర్మించిన చిత్రం విజేత. ర‌జ‌ని కొర్రపాటి నిర్మాత‌. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌ సంగీతం అందించారు. జులై 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మంచి కలెక్షన్లతో దూసుకెళుతుండటంతో ఆదివారం విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తొలి బౌండ‌రీ కొట్టి సంబ‌రాలు చేసుకున్న చాహ‌ల్‌

తొలి బౌండ‌రీ కొట్టి సంబ‌రాలు చేసుకున్న చాహ‌ల్‌

ఇంగ్లాండ్ తో జ‌రిగిన రెండో వ‌న్డేలో బ్యాట్స్‌మెన్‌ పేలవ ప్రదర్శనతో భారత్‌ 86 పరుగుల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే చివరి దశలో భారత శిబిరంలో ఒక్కసారిగా నవ్వులు నింపాడు లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌. 48వ ఓవర్‌లో ఐదో బంతిని లాంగాన్‌ మీదుగా చాహల్‌ చూడచక్కటి షాట్‌తో బౌండరీకి తరలించాడు. వన్డేల్లో అతనికిది తొలి బౌండరీ కావడంతో ఒక్కసారిగా‌ ఆనందంలో మునిగిపోయాడు. ఈ క్రమంలో బ్యాట్‌ పైకెత్తి డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు చూపిస్తూ సంబరాలు కూడా చేసుకున్నాడు. అత‌డి స‌హ‌చ‌రులు ఓటమి బాధలో ఉన్నప్పటికీ.. చాహల్‌ సంబరాలు చూసి కాసేపు నవ్వుకున్నారు.   
ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన గ‌ద్ద‌ర్‌

ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన గ‌ద్ద‌ర్‌

ప్రజా గాయ‌కుడు గద్దర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాజ్యాధికారం దిశగా వెళ్లాలనిపిస్తోందని, ఎన్నికల్లో పోటీ చేస్తానని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆదివారం హైద‌రాబాదులో జ‌రిగిన బీఎల్ఎఫ్ సమావేశంలో గద్దర్ మాట్లాడారు. కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. లాల్ నీల్ జెండాలతో నూతన పార్లమెంట్ తీసుకురావాల్సి ఉందన్నారు. లాల్‌నీల్ ఐక్యతతోనే బహుజన రాజ్యాధికారం సాధ్యమన్నారు. ఓటు హ‌క్కు కోసం త్వ‌ర‌లో ద‌ర‌ఖాస్తు చేస్తాన‌న్నారు. గద్దర్‌ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తామని,చట్ట సభలకు పంపుతామని సీపీఎం నేత వీరభద్రం చెప్పారు. 
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more