Short News

మీ బాత్ రూంలో ఎన్నటికీ ఉంచకూడని 8 వస్తువులు

మీ బాత్ రూంలో ఎన్నటికీ ఉంచకూడని 8 వస్తువులు

బాత్ రూం మీ పొద్దున రొటీన్ పనులన్నిటికీ నిలయం కావచ్చు, కానీ మీకు ఆ సమయంలో అవసరమైనవాటినన్నింటినీ అక్కడి మెడిసిన్ అరలో ఉంచటం నిజానికి హానికర బ్యాక్టీరియా మరియు విషపదార్థాలు సోకేలా చేస్తుంది. మనం రోజువారీ వాడే కొన్ని వస్తువులు బాత్ రూం తడి మరియు వెచ్చని వాతావరణానికి పాడైపోవచ్చు కూడా. ఈ స్లయిడ్ షోను క్లిక్ చేస్తూ ఏవి ఉంచవచ్చో, వేటి చోటును మార్చాలో తెలుసుకోండి.మొదలుపెట్టండి.

మిలిటెంట్ల స్థావరాలపై దాడులు.. 90కి పైగా మంది మృతి

మిలిటెంట్ల స్థావరాలపై దాడులు.. 90కి పైగా మంది మృతి

సిరియాలో డమస్కస్‌కు సమీపంలో ఉన్న ఈస్ట్రన్ గౌటా ప్రాంతంలో జరిగిన వైమానిక దాడుల్లో 94 మంది మృతిచెందగా మరో 20 మంది గాయపడ్డారు. కొంతకాలంగా సిరియా ఆర్మీ ఉగ్ర స్థావరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపధ్యంలో మిలిటెంట్లపై దాడులు జరుగుతున్నట్లు డమస్కస్ ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 4 లక్షల మంది జీవిస్తున్న ఈస్ట్రన్ గౌటా 2013 నుంచి మిలిటెంట్ల ఆధీనంలో ఉంది. 
బీఎస్‌ఎన్‌ఎల్‌ నుండి పలు కొత్త ఆఫర్స్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుండి పలు కొత్త ఆఫర్స్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్తగా ఆఫర్లు ప్రకటించింది. ఎస్‌టీవీ-99, ఎస్‌టీవీ-319, ప్లాన్‌-999, ప్లాన్‌-949, డేటా ఎస్‌టీవీ-7 పేరుతో ఈ ప్లాన్లు తీసుకొచ్చింది. ఉన్నాయి. ఎస్‌టీవీ-319, 99 ప్లాన్లు మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికే ప్లాన్‌ 999, 949, డేటా ఎస్‌టీవీ-7 ప్లాన్‌  అందుబాటులో ఉన్నాయి. సోమవారం నుంచి ఈనెల 28 వరకు మెగా సిమ్‌ మేళా నిర్వహిస్తోంది. ఉచితంగా 3జీ సిమ్‌తో పాటు ప్రతి రూ.110 రీచార్జ్‌తో ఫుల్‌ టాక్‌టైమ్‌ లభిస్తాయి.
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, కటిక పేదరికం, మెడపట్టి గెంటేశారు: జబర్దస్త్ గెటప్ శ్రీను

ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా, కటిక పేదరికం, మెడపట్టి గెంటేశారు: జబర్దస్త్ గెటప్ శ్రీను

జబర్దస్త్ కార్యక్రమంలో వివిధ గెటప్స్ వేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు గెటప్ శ్రీను. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జీవితం గురించి, కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. చిన్న తనంలో తాను పడ్డ కష్టాలతో పోలిస్తే ఇండస్ట్రీలో పడ్డ కష్టం పెద్ద కష్టమే కాదన్నారు. కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న అవమానాల గురించి కూడా తెలిపారు. నేను బాగా హర్టయిపోయి సూసైడ్ వరకు వెళ్లింది తేజ కేక సినిమా సమయంలో అని తెలిపారు. చివరకు బ్రతికి సాధిద్దామని డిసైడైనట్లు తెలిపారు.