Short News

మామిడి టెంకతో ఇలా చేస్తే ఎన్నో లాభాలు

మామిడి టెంకతో ఇలా చేస్తే ఎన్నో లాభాలు

చాలామంది మామిడి కాయ, పండు తినేసి టెంక పారేస్తారు. కానీ టెంక వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మామిడి టెంకను పొడి చేసుకొని జీలకర్ర, మెంతుల పొడితో సమానంగా కలిపి వండి వేడి వేడి అన్నంతో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.మామిడి టెంకలోని గింజను చూర్ణం చేసి రోజుకు మూడు గ్రాముల చొప్పున తేనెతో కలిపి సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. దగ్గు సమస్యలు తగ్గుతాయి. మామిడిటెంకలోని ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ జుట్టుకు పోషణనిస్తాయి. * తెల్లబడే జుట్టుకు చెక్ పెట్టాలంటే మామిడిటెంక పొడిలో కొబ్బరి, ఆలీవ్, ఆవనూనెలు కలిపి వెంట్రుకలకు పట్టించాలి.
నీర‌వ్ కు ఈడీ షాక్‌.. ఆస్తులు తాత్కాలికంగా అటాచ్‌

నీర‌వ్ కు ఈడీ షాక్‌.. ఆస్తులు తాత్కాలికంగా అటాచ్‌

డైమండ్‌ కింగ్‌ నీరవ్‌ మోదీకి మరో షాక్‌ తగిలింది. పీఎన్‌బీని భారీ కుంభకోణంలో ముంచెత్తి విదేశాలకు పారిపోయిన నీరవ్‌ మోదీకి చెందిన రూ.170 కోట్ల విలువైన ఆస్తులను మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద మోదీ ఆస్తులను తాత్కాలికంగా అటాచ్‌ చేసినట్టు ఈడీ చెప్పింది. వీటిలో నీరవ్‌ మోదీ ఫైర్‌స్టార్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ముంబై, సూరత్‌లో ఉన్న పండ్ర ఎంటర్‌ప్రైజస్‌ ప్రైవేట్ లిమిటెడ్‌లు ఉన్నాయి. ఆస్తుల అటాచ్‌మెంట్‌ మాత్రమే కాక నీరవ్‌ మోదీ, అత‌డి సోదరుడు నిశాల్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లు, సంస్థల బ్యాంకు అకౌంట్లను కూడా ఈడీ అటాచ్‌ చేసుకుంది.    
బ్లాక్ కాఫీ తాగితే కలిగే లాభాలు ఏంటో తెలుసా..?

బ్లాక్ కాఫీ తాగితే కలిగే లాభాలు ఏంటో తెలుసా..?

బ్లాక్ కాఫీ తాగడం వల్ల ఇంకా ఎక్కువ లాభాలు కలుగుతాయట. రోజుకు 2, 3 కప్పుల బ్లాక్ కాఫీ తాగడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే దెమెంతియా, పార్కిన్‌సన్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. బ్లాక్ కాఫీ తాగడం వల్ల లివర్ క్యాన్సర్, హెపటైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. లివర్‌లో ఉన్న కొవ్వు కరుగుతుంది. నిత్యం 2 కప్పుల కన్నా ఎక్కువగా బ్లాక్ కాఫీ తాగితే డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. బ్లాక్ కాఫీని నిత్యం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
అదిరిపోయేలా టీ20 లీగ్ ఫైన‌ల్ సంబ‌రాలు

అదిరిపోయేలా టీ20 లీగ్ ఫైన‌ల్ సంబ‌రాలు

టీ20 లీగ్ ఫైనల్‌ను అదిరిపోయేలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మ్యాచ్‌కు ముందు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రెండు గంటల పాటు ప్రదర్శన ఇవ్వనున్నాడు. సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్ ఖాన్, సోనమ్ కపూర్ అహుజా తదితరులు కూడా వేదికను పంచుకోనున్నారు. క్రికెట్ అభిమానుల‌ను ఆకర్షించేందుకు ఐపీఎల్ చరిత్రలో తొలిసారి మరాఠీ, మలయాళం బ్రాడ్‌కాస్టర్లు కూడా ముందుకొచ్చారు. మరాఠీ బ్రాడ్‌కాస్టర్లు నిర్వహించే సంబరాల్లో మాధురీ దీక్షిత్, స్వప్నిల్ జోషి పాల్గొననున్నారు.