Short News

ఇంగువ తింటే ఆరోగ్యానికి ఎంత మేలంటే...

ఇంగువ తింటే ఆరోగ్యానికి ఎంత మేలంటే...

రుచి కోసం వంట‌కాల్లో వేసే ఇంగువ వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. ఇంగువ వేసిన ఆహారం తింటే గ్యాస్ స‌మ‌స్య ఉండ‌దు. ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల అల్స‌ర్ల‌ను న‌యం చేసే శ‌క్తి ఇంగువ‌కు ఉంది. రుతు క్ర‌మం స‌రిగ్గా లేని మ‌హిళ‌లు కూడా ఇంగువ‌తో చేసిన ఆహారం తింటే రుతు క్ర‌మం మెరుగ‌వుతుంది. ఇది సంతాన సాఫ‌ల్య‌త అవ‌కాశాల‌ను పెంచుతుంది. ఇంగువ ర‌క్త నాళాల్లో కొవ్వు గ‌డ్డ క‌ట్ట‌కుండా చూస్తుంది. ఇంగువ‌ను గోరు వెచ్చ‌ని నీళ్లు లేదా మ‌జ్జిగ‌లో క‌లిపి తీసుకోవాలి.    
''టీ యాప్ ఫోలియో''తో మీ పనుల‌న్నీ సులువు

''టీ యాప్ ఫోలియో''తో మీ పనుల‌న్నీ సులువు

ప్రజలు కార్యాలయాలు, మీ- సేవ కేంద్రాల చుట్టూ తిరగకుండా ఇంట్లోనే కూర్చొని ప్రభుత్వ సేవలు పొందే విధంగా టీ యాప్‌ ఫోలియో అనే అప్లికేన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవ‌ల ప్రవేశపెట్టింది. ప్రస్తుతం మీ సేవ కేంద్రాల ద్వారా అందుతున్న 150 రకాల సేవలు టీ యాప్‌ ఫోలియో అప్లికేష్‌ ద్వారా ప్రజలకు అందుబాటులో వచ్చాయి. దీంతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభతరంగా కానున్నాయి.ప్రభుత్వ సేవలను సులువుగా పొందడమే కాకుండా మీ-సేవ కేంద్రాల్లో చెల్లించే నగదు కన్నా తక్కువ ఖర్చుతో సేవ‌లు పొంద‌డం ఈ యాప్‌ ప్రత్యేకత.   
రిసెర్చ్ లో కొన్ని నిజాలు, మహానటి సావిత్రి గురించి నిర్మాత ప్రియాంక దత్!

రిసెర్చ్ లో కొన్ని నిజాలు, మహానటి సావిత్రి గురించి నిర్మాత ప్రియాంక దత్!

సమంత, విజయ్ దేవరకొండలు జర్నలిస్టుల పాత్రల్లో కనిపించబోతున్న సావిత్రి సినిమాను యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అస్వినిదత్ ఈ సినిమాను ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. సమంత, విజయ్ దేవరకొండలు జర్నలిస్టుల పాత్రల్లో కనిపించబోతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై పాపులర్ అయ్యింది. సావిత్రి సినిమాలు చుసిన ప్రేక్షకులు సావిత్రిని మరోసారి స్క్రీన్ మీద చూడాలని కుతూహలంగా ఉన్నారు. ఆమె గురించి తెలియనివారు తన గురించి తెలుసుకోవాలని ఉన్నారు.

సహజమైన పద్ధతిలో క్యాన్సర్ను నివారించడం ఎలా ?

సహజమైన పద్ధతిలో క్యాన్సర్ను నివారించడం ఎలా ?

కారకాలను మార్పులు చేయడం ద్వారా నివేదించబడ్డాయని కొన్ని నివేదికలు తెలియజేశాయి. ఆ కారకాలు ఏమిటంటే ఉదాహరణకు:- ఆరోగ్యకరమైన శరీర బరువు, క్రమబద్ధమైన వ్యాయామం, మద్యమును తక్కువ వినియోగించడం వంటి మొదలైన చర్యలు.

జన్యుపరమైన మార్పులు, ధూమపానం, అదనపు బరువును కలిగి ఉండటం, నికోటిన్ను ఉపయోగించడం, వ్యాయామం చేయకపోవడం, రసాయనాలను కలిగి ఉన్న కాస్మెటిక్స్ను ఉపయోగించడం, రేడియేషన్ తీవ్రత, వంశపారపర్యంగా వచ్చే హార్మోన్ల అసమానత & ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల శరీరంలో ఏర్పడే వాపుల వంటివి క్యాన్సర్ని కలుగజేసే వ్యాధి కారకాలని చెప్పవచ్చు.