Short News

మీ డేటింగ్ భాగస్వామిని ఖచ్చితంగా అడగాల్సిన  ప్రశ్నలివే ..!

మీ డేటింగ్ భాగస్వామిని ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్నలివే ..!

మీరు ఎంతో కాలం పాటు మీ భాగస్వామితో డేటింగ్ చేసి ఉండొచ్చు, కానీ మీ భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకున్నారా. అయితే ముందు ఆ పని చేయండి.

సాన్నిహిత్యం అనేది ప్రతి కోరిక యొక్క మార్గం. సాన్నిహిత్యం మీ మద్య పరస్పర ఇష్టాన్ని పెంచుతుంది. సరైన సాన్నిహిత్యం ఇద్దరు వ్యక్తుల మధ్య సునిశిత సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది.

డేటింగ్ చేస్తున్నప్పుడు, మనం ఎల్లప్పుడూ నిత్యనూతనంగా, యవ్వనంగా ఉండేలా ప్రయత్నిస్తాము. ఇక్కడ భౌతిక సంబంధం కోసం యాచించడం కూడా యాదృచ్చికమే.

ఇంతకు మించి ఎక్కువ అడగను.. తిరిగి ఇవ్వలేను.. ఎమోషనల్ అయిన ఎన్టీఆర్!

ఇంతకు మించి ఎక్కువ అడగను.. తిరిగి ఇవ్వలేను.. ఎమోషనల్ అయిన ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 35 వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకున్నారు. సినీ ప్రముఖులు యంగ్ టైగర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని విడుదల చేసి ఎన్టీఆర్ అభిమానుల సంతోషాన్ని పెంచింది చిత్ర యూనిట్. అరవింద సమేత వీర రాఘవ అనే అద్భుతమైన టైటిల్ ని త్రివిక్రమ్ ఖరారు చేసారు.

కనిపిస్తే కాల్చివేసే రోజులొస్తాయి..: సీఎం రమేష్ పై మంత్రి ఆద

కనిపిస్తే కాల్చివేసే రోజులొస్తాయి..: సీఎం రమేష్ పై మంత్రి ఆద

సీఎం రమేష్‌ ప్రతి పనికీ అడ్డొస్తే కనిపిస్తే కాల్చివేత రోజులొస్తాయని మంత్రి ఆది నారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోట్లదుర్తి కుటుంబీకులకు చెప్పులతో కొట్టే రోజులు వస్తాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను గన్‌లాంటి వాడిని అని, కార్యకర్తలు బుల్లెట్‌లను అందిస్తే తన పని కాల్చడమేనని ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గంలో సీఎం రమేష్ వందల కోట్లు పనులు చేసుకుంటున్నా తాము పట్టించుకోవడం లేదని చెప్పారు. కొంత మంది తమపై నీచంగా మాట్లాడుతున్నారని, తాను మార్కెట్‌ యార్డులో కూపన్లు అమ్ముకున్నానని ప్రచారం చేయడం నీచమన్నారు.

వణికిస్తోన్న 'నిఫా' వైరస్: కేరళకు అత్యవసరంగా వ్యాధి నియంత్రణ

వణికిస్తోన్న 'నిఫా' వైరస్: కేరళకు అత్యవసరంగా వ్యాధి నియంత్రణ

కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. వైరస్ సోకిన ముగ్గురు మృత్యువాత పడటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జాతీయ వ్యాధి నియంత్రణ బృందాన్ని కేంద్రమంత్రి జేపీ నడ్డా కేరళకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు.కేంద్రమంత్రి ఆదేశాల మేరకు జాతీయ బృందం వెళ్లి అక్కడి పరిస్థితిపై సమీక్షించనుంది. 'కేరళలో నిఫా వైరస్ వ్యాప్తిపై సమీక్షపై నిర్వహించాం. జాతీయ వ్యాధి నివారణ బృందాన్ని అక్కడికి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాం.' అని జేపీ నడ్డా తెలిపారు.