Short News

పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ అసత్యమయ్యే అవకాశం ఉందా?

పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రిజల్ట్ అసత్యమయ్యే అవకాశం ఉందా?

మహిళ జీవితంలో ప్రెగ్నెన్సీ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి మహిళ మాతృత్వపు ఆనందాన్ని పొందాలని భావిస్తుంది. మహిళ జీవితంలో గర్భం దాల్చడమనేది ముఖ్యమైన మలుపు. ఈ దశపై మహిళలు అనేక అంచనాలను పెట్టుకుంటారు.

గర్భం దాల్చిన విషయాన్ని నిర్ధారించేందుకు హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లు తోడ్పడతాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పై కనిపించే రెండు లైన్లు గర్భం దాల్చిన విషయాన్ని నిర్ధారిస్తాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న మహిళ ఆనందానికి అవధులు ఉండవు.

షారుఖ్ అంత పెద్ద సెలబ్రెటీ..కానీ కొంచెం కూడా పొగరులేదు

షారుఖ్ అంత పెద్ద సెలబ్రెటీ..కానీ కొంచెం కూడా పొగరులేదు

పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌పై ఆయన మాజీ భార్య రెహమ్‌ ఖాన్‌ సంచలన ఆరోపణలు చేస్తూ ఆత్మకథను రూపొం‍దించారు. అయితే పలువురు వ్యక్తులను విమర్శిస్తూ రాసుకొచ్చిన రేహమ్‌... కేవలం బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ఎంతో మర్యాద కలిగిన వ్యక్తి అంటూ తన పుస్తకంలో కొనియాడారు. గతంలో ఒక ప్రఖ్యాత చానల్‌లో జర్నలిస్టుగా పని చేసిన రేహమ్‌.. ఓ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌తో కాసేపు ముచ్చటించారట. అంత పెద్ద సెలబ్రిటీ అయినా కొంచెం కూడా పొగరు లేదని తన పుస్తకంలో రాశారు.
చిన్నారిపై యువకుడి అత్యాచార యత్నం

చిన్నారిపై యువకుడి అత్యాచార యత్నం

ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై 30 ఏళ్ల కామాంధుడు అత్యాచార యత్నానికి పాల్పడిన సంఘటన అనంతపురం జిల్లా కణేకల్లు పట్టణంలో చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం...కణేకల్లులోని ఉరవకొండ రోడ్డులో వెంకటేష్‌ అనే అవివాహిత యువకుడు నూతనంగా గృహాన్ని నిర్మిస్తున్నాడు. గృహ నిర్మాణ పనుల కోసమని కొంతకాలంగా ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్న వెంకటేష్ చుట్టుప్రక్కల చిన్నారులతో బాగా సఖ్యతగా ఉండేవాడు. వారికి చాక్లెట్లు ఇవ్వడంతో పాటు సెల్‌ఫోన్లో బొమ్మలు చూపిస్తూ, పాటలు వినిపిస్తూ మాలిమి చేసుకునేవాడు.

తొలిసారి రూ.3 లక్షల కోట్లకు చేరిన ఇన్ఫోసిస్‌

తొలిసారి రూ.3 లక్షల కోట్లకు చేరిన ఇన్ఫోసిస్‌

దేశీయ రెండో అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు సోమవారం దూసుకెళ్లాయి. ఈరోజు ఉదయం ఆ కంపెనీ షేరు ధర 52 వారాల గరిష్ఠానికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.3 లక్షల కోట్లను చేరింది. ఈరోజు ఉదయం బీఎస్‌ఈలో ఇన్ఫీ షేరు ధర 5.75శాతం పెరిగి రూ.1,384.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక ఎన్‌ఎస్‌ఈలో ఆ కంపెనీ షేర్‌ ధర 5శాతం పెరిగి ఏడాది గరిష్ఠానికి చేరింది. గత వారం విడుదలైన ఇన్ఫీ త్రైమాసిక ఫలితాలు మిశ్రమంగా నమోదైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌-జూన్‌లో ఇన్ఫీ ఏకీకృత నికర లాభం 3.7శాతం వృద్ధి చెంది రూ.3,612కోట్లకు చేరింది.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more