Short News

వెల్లుల్లి ఈ 9 రకాలుగా మీ పిల్లలకు ప్రయోజనకారిగా ఉంటుంది

వెల్లుల్లి ఈ 9 రకాలుగా మీ పిల్లలకు ప్రయోజనకారిగా ఉంటుంది

తమ పిల్లలకు ఏ మాత్రం అస్వస్థత చేసినా చాలా మంది తల్లిదండ్రులు యాంటీ బయాటిక్స్ పై ఆధారపడతారు. యాంటీ బయాటిక్స్ ని ఎక్కువగా వాడటం మంచిది కాదని తెలిసినా తల్లిదండ్రులు తమ పిల్లల అస్వస్థతను నయం చేసేందుకు వాటిపైనే ఎక్కువగా ఆధారపడి పరోక్షంగా తమ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. వెల్లుల్లిలో ఔషధ గుణాలు ఎక్కువన్న సంగతి పెద్దలు మనకు చెప్తూనే ఉన్నారు. పిల్లల డైట్ లో వెల్లుల్లిని భాగం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.

రూ.2,253 కోట్ల హవాల రాకెట్ గుట్టురట్టు

రూ.2,253 కోట్ల హవాల రాకెట్ గుట్టురట్టు

ముంబైలో హవాలా రాకెట్ గుట్టురట్టయింది. మహ్మద్‌ ఫరూక్‌ అలియాస్‌ ఫరూక్‌ షేక్‌ అనే వ్యక్తి దాదాపు రూ.2,253 కోట్ల మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. మనీ లాండరింగ్‌ నివారణ చట్టం కింద ఫరూక్‌ను అధికారులు అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. నకిలీ దిగుమతి డాక్యుమెంట్ల ద్వారా కోట్ల రూపాయలను విదేశాలకు తరలించడానికి ఫరూక్‌ 13 కంపెనీలను వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతన్ని ఏప్రిల్‌ 26 వరకు ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది.
మహానటి సినిమా లేటెస్ట్ న్యూస్, చిత్ర యూనిట్ అంతా ఒక్క చోటికి!

మహానటి సినిమా లేటెస్ట్ న్యూస్, చిత్ర యూనిట్ అంతా ఒక్క చోటికి!

మహానటి సినిమాలో నటించిన నటీనటుల పాత్రలు త్వరలో పోస్టర్స్ ద్వారా విడుదల చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. మే ఒకటిన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను గ్రాండ్ గా చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ''తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం.. తరతరాలు గర్వించే కథ మహానటి సావిత్రి కథ''. తన అంద చందాలతోనే కాదు, గుణగణాలతోను ఇప్పటికీ తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటి మహానటి సావిత్రి. ఈ మహానటి రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను ఎందరికో స్పూర్తిదాయకంగా నిలిచింది.

క్యాన్సర్‌తో భాదపడుతున్న నటి, మెగాస్టార్ సాయం.. స్వయంగా ఇంటికి వెళ్లిన చిరు కుమార్తె శ్రీజ!

క్యాన్సర్‌తో భాదపడుతున్న నటి, మెగాస్టార్ సాయం.. స్వయంగా ఇంటికి వెళ్లిన చిరు కుమార్తె శ్రీజ!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా చిత్ర షూటింగ్ తో బిజీగా గడుపుతున్నారు. ఆపదలో కష్టాల్లో ఉన్న ఎవరికైనా సాయమా అందించే స్వభావం చిరంజీవి సొంతం. సీనియర్ నటి సుభాషిణి గత కొంతకాలంగా క్యాన్సర్ తో బదపడుతున్నారు. ఆమె పలు టాలీవుడ్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ స్వయంగా సుభాషిణి ఇంటికి వెళ్లి ఆమెని పరామర్శించడం విశేషం. సుభాషిణి ఆరోగ్యం గురించి ఆరా తీసిన శ్రీజ రూ 2 లక్షల ఆర్థిక సాయం అందజేయడం విశేషం.