Short News

వ్యాయామం చేయకపోతే గుండెపోటు  ఖాయం

వ్యాయామం చేయకపోతే గుండెపోటు ఖాయం

సరైన వ్యాయామం లేకపోవడం వల్ల గుండెపోటు వంటి ప్రమాదకరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 6 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు వ్యాయామం చేయని వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ చేసేవారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువంటున్నారు.మధ్య వయస్కులు వారానికి కనీసం 150 నిమిషాలన్నా శరీరానికి తగినంత పని చెయాలట.
ఫ్లిప్‌కార్ట్‌  ఆపిల్ వీక్ సేల్..తక్కువ ధరలకు ఆపిల్ ఉత్పత్తులు

ఫ్లిప్‌కార్ట్‌ ఆపిల్ వీక్ సేల్..తక్కువ ధరలకు ఆపిల్ ఉత్పత్తులు

ఆపిల్‌ అభిమానులకు శుభవార్త. ఆపిల్‌ వీక్‌ సేల్‌ పేరుతో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌ను ప్రారంభించింది. ఐఫోన్లపై మాత్రమే కాక, ఆపిల్‌ 10వ వార్షికోత్సవ ఎడిషన్‌ ఐఫోన్‌ ఎక్స్‌, మ్యాక్‌బుక్స్‌, ఐప్యాడ్స్‌, ఎయిర్‌పాడ్స్‌, ఆపిల్‌ వాచ్‌ సిరీస్‌లపై కూడా భారీ డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న ఆపిల్‌, ఎంపిక చేసిన ఆపిల్‌ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ సేల్‌, మే 27 వరకు జరుగనుంది.   
జూన్‌ 1న మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు'

జూన్‌ 1న మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు'

మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్‌.మిత్రన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇరుంబుతెరై'. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. ఈ చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో ఎం.పురుషోత్తమన్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ పతాకంపై జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జూన్‌ 1న 'అభిమన్యుడు' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

డెర్మటాలజిస్ట్ లు సూచించిన ఈ సీక్రెట్ క్యూర్స్ ని పాటిస్తే సన్ బర్న్ నుంచి విముక్తి పొందవచ్చు

డెర్మటాలజిస్ట్ లు సూచించిన ఈ సీక్రెట్ క్యూర్స్ ని పాటిస్తే సన్ బర్న్ నుంచి విముక్తి పొందవచ్చు

ఎండాకాలం వచ్చిందంటే కొన్ని చర్మ సమస్యలు కూడా వెంట వస్తాయి. వేసవిని ఆనందంగానే స్వాగతిస్తాము. అయితే, వేసవితో పాటు వెంట వచ్చే చర్మ సమస్యలు మనల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. అందులో ముఖ్యంగా మనం సన్ బర్న్ సమస్య గురించి చెప్పుకోవాలి. ఎండలో ఎక్కువసేపు ఉండటం వలన చర్మం కమిలినట్లు మారుతుంది. దీనినే సన్ బర్న్ అనంటారు. సూర్యరశ్మిలో కొన్ని హానికర కిరణాలు చర్మాన్ని తాకడం వలన చర్మం దెబ్బతింటుంది. ఈ సమస్యను అశ్రద్ధ చేయకూడదు.