Short News

మీ భర్తకు ఉత్తమ భార్యగా ఉండాలని భావిస్తున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే

మీ భర్తకు ఉత్తమ భార్యగా ఉండాలని భావిస్తున్నారా? అయితే ఈ వ్యాసం మీకోసమే

నిజానికి ఒక వ్యక్తి యొక్క మనస్సును అర్థం చేసుకోవడం కష్టమని మీకు తెలుసు, అదేక్రమంలో సాధారణంగా మీ భాగస్వామి మనసును అర్థం చేసుకోవడం కూడా కష్టమే. నిజానికి ఒక భార్యగా ఉండడమంత కష్టమైన పని మరొకటి లేదు అని అనేక మంది అభిప్రాయం కూడా. కానీ ఆత్మ గౌరవం ఉన్న ఏ స్త్రీ కూడా భార్యగా ఉన్న పక్షంలో అన్నిటికీ తలొగ్గి ఉండాలని కోరుకోదు. తప్పును ఎదిరిస్తుంది, మంచికి అండగా నిలబడుతుంది. భర్త అడుగుజాడలలో నడవాలని చెప్తుంటారు, కానీ భర్తే అస్తవ్యస్తంగా మార్గాన్ని నడుపుతుంటే? భర్తను కూడా దారిలో పెట్టాల్సిన భాద్యత భార్యకు ఉంటుంది.

లోకసభలో చంద్రబాబును దులిపేసిన మోడీ

లోకసభలో చంద్రబాబును దులిపేసిన మోడీ

అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్‌తో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్యాకేజీకి అంగీకరించి ప్రశంసించిన ఆయన వైసీపీ ఉచ్చులో పడి, తన స్వార్థ ప్రయోజనాల కోసం యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు. ఆ రోజు తాను తల్లిని చంపి బిడ్డను కాపాడారని అన్నానని, ఇప్పుడు తెలుగు తల్లి స్ఫూర్తిని కాపాడాలని చెబుతున్నానని అన్నారు. టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం ఘోరంగా వీగిపోయింది. మోడీకి మద్దతుగా 325 ఓట్లు (అవిశ్వాసానికి వ్యతిరేకంగా), అవిశ్వాసానికి అనుకూలంగా 126 ఓట్లు వచ్చాయి.

ప్రియాంక చోప్రా పుట్టినరోజు డ్రెస్ ..అక్షరాలా ఎంతంటే

ప్రియాంక చోప్రా పుట్టినరోజు డ్రెస్ ..అక్షరాలా ఎంతంటే

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా గతకొద్ది కాలంగా మీడియాకు ఆకర్షణగా మారారు. పెళ్ళి అనో, పుట్టినరోజు అనో, నిశ్చితార్ధం అనో ఏదో రకంగా వార్తల్లో ఉంటోంది. బాలీవుడ్ నుండి హాలీవుడ్ కు వెళ్ళిన ఈ అమ్మడు వేసుకునే బట్టలు, యాక్ససరీస్ ఫ్యాషన్ ఐకాన్ అవుతున్నాయి. జూలై 18న ప్రియాంక తన పుట్టిన సందర్భంగా ధరించిన వైట్‌ స్కర్ట్‌ ధర దాదాపు 2లక్షలట. ప్రియాంక్ వేసుకున్న బాల్‌మెయిన్‌ బటన్డ్‌ మాక్సీ స్కర్ట్‌, వైనస్‌ వైట్‌ ములస్‌ రెండింటి ధర 2,795 డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాల 1,86,660 రూపాయలు. 
కాంగ్రెస్సే నయం: మోడీపై బాబు నిప్పులు, మాట మారింది

కాంగ్రెస్సే నయం: మోడీపై బాబు నిప్పులు, మాట మారింది

ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మాట్లాడలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఏపీ అభివృద్ధిపై మాట్లాడకుండా, అదే నిర్లక్ష్యం ప్రదర్శించారన్నారు. ఇంతటి బాధ్యతారాహిత్య కేంద్రాన్ని గతంలో చూడలేదన్నారు. బీజేపీ దుర్మార్గ వైఖరి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే నయమనే అభిప్రాయం కలుగుతోందన్నారు. కాగా, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఒకింత అనుకూలంగా మాట్లాడటం చర్చనీయాంశమైన అంశమే. మోడీ మాట్లాడుతూ మన దేశభక్తిని శంకించారని, ఇది ఆక్షేపమనీయమన్నారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more