Short News

ఉప్పు ఎక్కవగా వాడకంతో కిడ్నీలకు ముప్పు.!

ఉప్పు ఎక్కవగా వాడకంతో కిడ్నీలకు ముప్పు.!

యుక్త వయసులో మూత్రపిండ సంబంధ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య దేశంలో పెరిగిపోతున్నది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఉప్పు వాడకాన్ని తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు. మూత్రపిండాలు చెడిపోవడానికి ప్రధాన కారణం రక్తపోటు పెరగడమేనంటున్నారు. శరీరంలోకి ఉప్పును ఎక్కువగా తీసుకుంటుండటంతో హైపర్‌టెన్షన్‌కు దారి తీస్తున్నదని ముంబైకి చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అరుణ్ పీ దోషి పేర్కొన్నారు. ఉప్పు వాడకాన్ని నియంత్రించగలిగితే హైపర్‌టెన్షన్ తగ్గుతుందని, తద్వారా కిడ్నీలు చెడిపోకుండా కాపాడవచ్చని తెలిపారు.
చెన్నై సూపర్ కింగ్స్ కు ముంబై హైకోర్టు షాక్

చెన్నై సూపర్ కింగ్స్ కు ముంబై హైకోర్టు షాక్

చెన్నై సూపర్ కింగ్ జట్టుకు ముంబై హైకోర్టు షాకిచ్చింది. పుణె మైదానాన్ని సిద్ధంచేసేందుకు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు పవానా డ్యాం నుంచి నీటిని ఉపయోగించొద్దని మహారాష్ట్ర క్రికెట్ సంఘాన్ని బాంబే కోర్టు ఆదేశించింది. పుణె వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ కోసం వినియోగించే నీటిని ఎలా సమకూర్చుకుంటున్నారో తమకు వివరణి ఇవ్వాలని ఎంసీఏకు కోర్టు గత వారం కోర్టు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో పుణెలో మ్యాచ్‌లు జరిగే పరిస్థితులు కనిపించట్లేదు. ఈ స్టేడియంలో ఆరు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
టాప్-10 అత్యంత కాలుష్య నగరాల్లో కాలిఫోర్నియా..

టాప్-10 అత్యంత కాలుష్య నగరాల్లో కాలిఫోర్నియా..

గోల్డెన్ స్టేట్ గా పిలుచుకునే నగరం కాస్త ఇప్పుడు కాలుష్య నగరంగా మారిపోయింది. అమెరికాలోని 10 అత్యంత కాలుష్య నగరాల్లో కాలిఫోర్నియా ఎనిమిదో స్థానంలో ఉన్నట్టు తేలింది. అమెరికన్ లంగ్ అసోసియేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. వాయు కాలుష్యంపై సంస్థ అందించిన వార్షిక రిపోర్ట్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

వాయుకాలుష్యం కారణంగా 133మిలియన్ల అమెరికన్లు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపింది. ప్రతీ 10మంది అమెరికన్లలో నలుగురు వాయు కాలుష్యంతో అనారోగ్యం బారినపడుతున్నట్టు వెల్లడించింది.

గగనతలంలో అనూహ్య ఘటన: విమానంలో ఒక మహిళ మృతి

గగనతలంలో అనూహ్య ఘటన: విమానంలో ఒక మహిళ మృతి

డల్లాస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరిన సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ విమానం-1380 అనుకోని ప్రమాదానికి గురైంది. సాంకేతిక కారణాలతో గగనతలంలోనే విమానం ఇంజన్ పేలిపోయింది. పేలిన ఇంజన్ శకలంలో విమానంలోకి దూసుకురావడంతో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో విమానంలోని మిగతా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.

ప్రమాదం జరిగిన సమయంలో.. ఇంజన్ నుంచి లీకైన గ్యాస్ విమానంలోకి వచ్చి చేరడంతో.. ప్రయాణికులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిపడ్డారు. దీంతో అందరికీ ఆక్సిజన్ మాస్కులు అందించినప్పటికీ.. దురదృష్టవశాత్తు జెన్నిఫర్ అనే ఓ మహిళ మృతి చెందారు.