Short News

మీరు పరిణితి చెందిన స్త్రీ తో ఉన్నారని తెలియజేసే లక్షణాలు ఇవే

మీరు పరిణితి చెందిన స్త్రీ తో ఉన్నారని తెలియజేసే లక్షణాలు ఇవే

సంబంధ బాంధవ్యాల విషయాల దగ్గరకు వచ్చేసరికి స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయమై పురుషులకు నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి.

పరిణితి చెందిన స్త్రీలు ఈ విషయం మొత్తాన్ని ఎంతో సమర్ధవంతంగా అర్ధం చేసుకోగలరు. ఈ వ్యవహారంలో మరీ లోతులకు వెళ్లి ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోకుండా ఇలాంటి స్త్రీలు పరిణితితో వ్యవహరిస్తారు. ప్రతి ఒక్క విషయం పై అవగాహన కలిగి ఉంటారు.మీరు పరిణితి చెందిన స్త్రీ తోనే ఉన్నారు అని తెలియజెప్పే లక్షణాలు ఇవే :


పరిణితి చెందిన స్త్రీతో సంబంధ బాంధవ్యం ఏర్పడినట్లైతే మీరు ఎదగడానికి అది ఎంతగానో తోడ్పడుతుంది.

క‌థువా ఘ‌ట‌న‌లో ప‌క్కా ఆధారాలు ల‌భ్యం

క‌థువా ఘ‌ట‌న‌లో ప‌క్కా ఆధారాలు ల‌భ్యం

కథువా అత్యాచారం కేసులో జమ్మూ కశ్మీర్ సిట్ అధికారులు నిందితులకు సంబంధించిన పక్కా ఆధారాలు సేకరించారు. ఆలయం వద్ద సేకరించిన రక్త నమూనాలు బాధితురాలివేనని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్‌ తేల్చింది. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారనీ, గుడిలోనే ఈ అఘాయిత్యం జరిగినట్టు రుజువైందని అధికారులు తెలిపారు. ఆలయంలో సేకరించిన తలవెంట్రుకలు నిందితుడు శుభమ్ సంగ్రా డీఎన్ఏతో సరిపోలినట్టు తెలిపారు. ఆధారాలను తుడిచిపెట్టేందుకు అతడు బాధితురాలి దుస్తులను శుభ్రం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 
డ్యూయెల్ సపోర్ట్‌తో ఐఫోన్, అత్యంత తక్కువ ధరకే !

డ్యూయెల్ సపోర్ట్‌తో ఐఫోన్, అత్యంత తక్కువ ధరకే !

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న ప్రముఖ దిగ్గజం ఆపిల్ కంపెనీ సరికొత్తగా మార్కెట్లోకి దూసుకువస్తోంది. దిగ్గజాలకు సవాల్ విసురుతూ కొత్త టెక్నాలజీతో అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ ను లాంచ్ చేపే ఆలోచనలో ఉన్నట్లు లీకేజి రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కాగా కంపెనీ ఈ ఏడాది మూడు ఐఫోన్‌ మోడల్స్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కొత్త ఫోన్ల తయారీ కూడా ఆపిల్‌ ప్రారంభించిందని తెలుస్తోంది.

సాయిబాబాను దర్శించుకొన్న సీఎం కెసిఆర్

సాయిబాబాను దర్శించుకొన్న సీఎం కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం నాడు కుటుంబసభ్యులతో కలిసి షీర్డీ సాయిబాబాను దర్శించుకొన్నారు. ఇవాళ ఉదయం హైద్రాబాద్‌ నుండి కెసిఆర్ ప్రత్యేక విమానంలో కుటుంబసభ్యులతో కలిసి షీర్డీకి వెళ్ళారు.బేగంపేట విమానాశ్రయం నుండి కెసిఆర్ కుటుంబసభ్యులతో కలిసి హైద్రాబాద్‌ నుండి షీర్డీకి వెళ్ళారు. షీర్డీలో సాయిబాబాను దర్శించుకొన్న తర్వాత హైద్రాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. సాయిబాబా ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌కు షిర్డీ సంస్థాన్‌ ట్రస్ట్‌ నిర్వహకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.