Short News

బరువు తగ్గకుండా అడ్డుకునే 6 ఆరోగ్యవంతమైన ఆహారాలు మీకు తెలుసా ?

బరువు తగ్గకుండా అడ్డుకునే 6 ఆరోగ్యవంతమైన ఆహారాలు మీకు తెలుసా ?

ఆరోగ్యవంతమైన, సమతుల్యమైన ఆహారం తీసుకోవడానికే ఈ మధ్య ప్రజలు అందరు మొగ్గు చూపుతున్నారు. కానీ, బరువు తగ్గాలనుకుంటే కూడా అలాంటి ఆహారమే సరిపోతుంది అని అనుకుంటే పొరబడినట్లే. మీరు ఆరోగ్యవంతమైన ఆహారం తింటున్నప్పుడు కూడా, కొన్ని సార్లు బరువు తగ్గాలనుకుంటే మాత్రం కష్టతరం అవుతుంది. ఆరోగ్యవంతమైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తినడానికి మరియు బరువు తగ్గడానికి తీసుకొనే ఆహారానికి చాలా వ్యత్యాసం ఉంది.

పానాసోనిక్ ఫోన్ పై రూ. 1500 ఐడీయా క్యాష్ బ్యాక్ ఆఫర్

పానాసోనిక్ ఫోన్ పై రూ. 1500 ఐడీయా క్యాష్ బ్యాక్ ఆఫర్

టెలికాం కంపెనీ ఐడీయా సెల్యూలార్ ..పానాసోనిక్ పీ 100 మొబైల్ పై రూ.1500 క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. క్యాష్ బ్యాక్ ఆఫర్ లో భాగంగా రూ.5,299 ఫోన్ ను రూ.3,799 కే అందిస్తోంది. వినియోగదారులు మొదట ఫోన్‌ను రూ.5,299కు కొనుగోలు చేయాలి. అనంతరం అందులో ఐడియా సిమ్‌ను వినియోగించాలి. అప్పుడు నెలకు రూ.199 లేదా ఆపైన విలువ గల ప్లాన్‌ను వాడాలి. మొదటి 12 నెలల పాటు చేస్తే కస్టమర్లకు రూ.300 క్యాష్ బ్యాక్ వస్తుంది. మరో 12 నెలల పాటు ఇలాగే వాడితే మరో రూ.1200 క్యాష్ బ్యాక్ ఇస్తారు. దీంతో ఫోన్ ధర రూ.3,799కే లభిస్తునట్టవుతుంది
అజ్ఞాతవాసులు! జగన్‌ను అవహేళన చేస్తారా?: బాబు, పవన్‌పై బొత్స

అజ్ఞాతవాసులు! జగన్‌ను అవహేళన చేస్తారా?: బాబు, పవన్‌పై బొత్స

రాష్ట్ర ప్రయోజనాల కోసం అంతా కలిసి పోరాటం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఓ అజ్ఞాతవాసి అని.. అప్పుడప్పుడూ బయటికి వచ్చి మాట్లాడతారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు అవసరమైనప్పుడు మాట్లాడరని విమర్శించారు. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ వైసీపీ పోరాటం చేస్తుందని చెప్పారు.

పెళ్లి వేడుకలో శ్రీదేవి, ఖుషి, మహేష్ హీరోయిన్ కైరా అడ్వాని సందడి (ఫోటోస్)

పెళ్లి వేడుకలో శ్రీదేవి, ఖుషి, మహేష్ హీరోయిన్ కైరా అడ్వాని సందడి (ఫోటోస్)

బాలీవుడ్ హీరో మోహిత్ మార్వా పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైంది. మోహిత్ తన ప్రియురాలు ఆంత్ర మోతివాలను పెళ్లాడ బోతున్నారు. ఆల్రెడీ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ యూఏఈలో ప్రారంభం అయ్యాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు అర్జున్ కపూర్, మనీష్ మల్హోత్రా, సిద్ధాంత్ కపూర్, రియా కపూర్, శ్రీదేవి, ఖుషి కపూర్, కైరా అడ్వాని తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు. వీరితో పాటు బోనీ కపూర్, హర్షవర్దన్, సోనమ్ కపూర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. మోహిత్ మార్వా, ఆంత్ర మోతీవాలా చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇద్దరూ ఎట్టకేలకు వివాహంతో ఏకం కాబోతున్నారు.