Short News

జీల‌క‌ర్ర‌, వాము, మెంతుల పొడిని రోజూ తీసుకుంటే ..

జీల‌క‌ర్ర‌, వాము, మెంతుల పొడిని రోజూ తీసుకుంటే ..

నేటి త‌రుణంలో కీళ్ళ నొప్పులు, కంటి చూపు, మ‌ల‌బ‌ద్ద‌కం, అధిక బ‌రువు, గుండె స‌మ‌స్య‌లు, మ‌ధుమేహం సమస్యలను చాల మంది ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటికి డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌కు తోడు మన వంటింట్లో ఉండే వస్తువులతో మిశ్రమాన్ని తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. న‌ల్ల జీల‌క‌ర్ర‌, వాము, మెంతులు మూడింటినీ కలిపి పొడిగా తయారు చేసుకోవాలి. రోజూ రాత్రి ఒక టీస్పూన్ పొడిని గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగాలి. 
చేతిలో ‘ఐఫోన్’ చూసి ‘గన్’ అనుకుని కాల్పులు జరిపారు
<iframe width="854" height="480" src="https://www.youtube.com/embed/p67HPqqxzPE" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

చేతిలో ‘ఐఫోన్’ చూసి ‘గన్’ అనుకుని కాల్పులు జరిపారు

సెల్‌ఫోన్‌ను తుపాకీగా భావించి, ఓ వ్యక్తిపై 20సార్లు కాల్పులు జరిపి చంపిన ఘటన కాలిఫోర్నియాలోని సాక్రమెంటోలో చోటుచేసుకుంది. స్టీఫెన్‌ అలోంజో క్లార్క్‌ సాక్రమెంట్‌లో ఉంటున్న తన తాతగారింటికి వచ్చాడు. రాత్రి తన సెల్‌ఫోన్‌ను తీసుకుని ఇంటి వెనక పెరట్లో తిరుగుతున్నాడు. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులకు అతడు సరిగా కనిపించకపోవడంతో నేరస్తుడని అనుమానించారు. అతని చేతిలో ఉన్నది తుపాకీనే అని అనుమానంతో క్లార్క్‌ పై కాల్పులు జరిపారు. అనంతరం అతడి దగ్గరకు వెళ్లి చూడగా అతని చేతిలో ఉన్నది ఆపిల్‌ ఐఫోన్‌ అని తెలిసింది.
"అది ఫ్లాప్ హీరో కట్టుకథ, పవన్ సభకు జనం తరలింపు"

"అది ఫ్లాప్ హీరో కట్టుకథ, పవన్ సభకు జనం తరలింపు"

అపరేషన్ గరుడ, ద్రవిడ అంతా అబద్ధమని, అదంతా ఓ ఫ్లాప్ హీరో ఊహాజనిత కథలని బిజెపి అదికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల హీరో శివాజీ ఆరోపణలను కొట్టి పారేశారు. కారెం శివాజీ లాగా ఈ శివాజీ కూడా ఏదో పదవి వచ్చే వరకు ఇలాగే చేస్తుంటారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డే అయితే సీమలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. బిజెపిని తిడతారని అనుకుని పవన్ కల్యాణ్ సభకు టిడిపి నేతల జనాన్ని తరించారని, అయితే అక్కడ సీన్ రివర్స్ అయిందని అన్నారు.

అవును.. వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్‌ అమ్మేసుకుంది

అవును.. వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్‌ అమ్మేసుకుంది

ఫేస్‌బుక్‌ సమాచార భద్రత విషయంలో మరో బాంబు పేలింది. ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకానికి పెడుతుందని వైట్‌హౌజ్‌ మాజీ అధికారి స్టీవ్‌ బన్నొన్‌ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌ తన ఖాతాదారులా డేటాను అమ్మేసుకుందన్నారు. అయితే రాజకీయ సంబంధిత డేటా చోరీ అంశంపై మాత్రం తనకు స్పష్టత లేదని.. కాబట్టి ఆ అంశంపై స్పందించబోనని బన్నొన్‌ తెలిపారు. గురువారం ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక నిర్వహించిన సదస్సులో పాల్గొన్న ఆయన పలు విషయాలను ప్రస్తావించారు.