Short News

కృష్ణ ప్రెగ్నెంట్ కాకూడదనే రాధ కండోమ్ వాడినా ఫలితం లేదు

కృష్ణ ప్రెగ్నెంట్ కాకూడదనే రాధ కండోమ్ వాడినా ఫలితం లేదు

అలా సంతోషంగా కాలం గడుపుతున్న సందర్భంలో తాను తల్లికాబోతున్నానని తెలుసుకుంది కృష్ణ. ఆ సంతోష వార్త ఎంత తొందరగా రాధ చెవిలో వేద్దామా అని సాయంకాలం వరకు నిరీక్షించిన తర్వాత రాధ ఇంట్లో అడుగు పెట్టగానే అతన్ని పెనవేసుకుని గుసగుసగా చెప్పింది. రాధ విసుకున్నాడు. "కొన్ని సంవత్సరాల వరకు మనం పిల్లల్ని వద్దకున్నాం కదా? అందుకే నేను కండోమ్స్ వాడేవాణ్ని. ఈ మధ్య నువ్వు కండోమ్స్ వాడొద్దని చెప్పడంతో అలా లేకుండా అందులో పాల్గొన్నాం. ఫలితంగా నీకు కడపు వచ్చింది. సరే ఉదయం డాక్టర్ వద్దకు వెళ్ళి అబార్షన్ చేయించుకో" అన్నాడు. అందుకు కృష్ణ మనస్సు ఏకీభవించలేదు.

అద్భుతమైన ఫీచర్ తో ‘వీవో వై53ఐ’ ఫోన్ విడుదల

అద్భుతమైన ఫీచర్ తో ‘వీవో వై53ఐ’ ఫోన్ విడుదల

మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వై53ఐ ని సోమవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో సెల్ఫీ కెమెరా ద్వారా ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని అందిస్తున్నారు. 5 ఇంచ్ డిస్‌ప్లే గల ఈఫోన్ లో 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది. రూ.7,990 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.
బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బేటీ బ‌చావో అన్న‌దెవ‌రో తెలుసా?

బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బేటీ బ‌చావో అన్న‌దెవ‌రో తెలుసా?

బేటీ బచావో, బేటీ పడావో అన్నది మోదీ పాత నినాదమని, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేల నుంచి బేటీ బచావో అంటున్నారని కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ విమర్శించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటూ ఇవాళ ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో రాహుల్ దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో సుమారు రెండు కోట్ల మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని.. కానీ ప్రధాని మోదీ మాత్రం ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతున్నారన్నారు. తమ మనసుల్లో ఏముందో 2019లో ప్రజలు మన్‌కీ బాత్ ద్వారా వెల్లడిస్తారని చ‌మ‌త్క‌రించారు.    
మళ్లీ అదే బ్యానర్ లోనే కల్యాణ్ రామ్  సినిమా

మళ్లీ అదే బ్యానర్ లోనే కల్యాణ్ రామ్ సినిమా

ఇటీవల ఎమ్మెల్యే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి కల్యాణ్ రామ్ త్వరలో నా నువ్వే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ , లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశాడు కల్యాణ్ రామ్. నా నువ్వే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న ఈస్ట్‌ కోస్ట్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లోనే మరో సినిమా చేయబోతున్నాడట. ఏప్రిల్‌ 25న కొత్త సినిమా ప్రారంభం కానుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.  నివేదా థామస్‌, షాలిని పాండేలు హీరోయిన్లుగా నటించనున్నారు.