Short News

జూలై 13న మీ 'రాశిచక్రం' ఏం చెప్తుందంటే.!

జూలై 13న మీ 'రాశిచక్రం' ఏం చెప్తుందంటే.!

ఈరోజు మేషరాశివారికి ఆర్ధిక లాభం, వృష‌భరాశి వారికి కుటుంబ సౌఖ్యం ఉంది. మిథున రాశివారు శుభవార్త వింటారు. క‌ర్కాట‌క రాశివారి ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సింహ రాశివారికి అనవసర ధన వ్యయం ఉంది. క‌న్య రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తుల‌ రాశి వారికి మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి పైఅధికారులతో సత్సబంధాలు ఏర్పడతాయి. ధ‌న‌స్సు రాశి వారికి తోటివారితో ఆనందంగా గడుపుతారు. మ‌క‌ర రాశి వారు ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. కుంభ, మీన‌రాశుల వారు శుభవార్తలు వింటారు.
బురారీ ఆత్మహత్య కేసు:గుండెపోటుతో పెంపుడు కుక్కమృతి

బురారీ ఆత్మహత్య కేసు:గుండెపోటుతో పెంపుడు కుక్కమృతి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బురారీ ఆత్మహత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలి ఉన్న ఏకైక ప్రాణి, పెట్‌ డాగ్‌ ‘టామీ' గుండెపోటుతో మరణించింది. కుటుంబ సభ్యులంతా ఆత్మహత్యకు యత్నించే సమయంలో ఆ పెట్‌ డాగ్‌ను గ్రిల్‌కు కట్టేసి ఉంచారు. ఈ పెట్‌ డాగ్‌ గురించి తెలుసుకు సంజయ్‌ మొహపాత్ర అనే జంతు హక్కుల పోరాట కార్యకర్త దానిని పోలీసుల అనుమతితో తన జంతు సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. కొత్త వాతావరణానికి అలవాటు కాలేకపోయింది. దీంతో ఆరోగ్యం మరింత క్షీణించి గుండెపోటుతో చనిపోయి ఉండోచ్చని అనుమానిస్తున్నారు.
ఎలిమినేట్ అయిన వారిని 'బిగ్‌బాస్‌-2' ఇంట్లోకి పంపించవచ్చు

ఎలిమినేట్ అయిన వారిని 'బిగ్‌బాస్‌-2' ఇంట్లోకి పంపించవచ్చు

తెలుగు 'బిగ్‌బాస్‌ 2' ఏదైనా జరగొచ్చని చెప్పినట్లే జరుగుతోంది. ఇప్పటికే ఇంటి నుండి సంజనా, నూతన నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వీలు బయటకు వెళ్ళిపోయారు. అయితే ప్రేక్షకులు వీరిలో ఎవరినైనా ఓట్లతో మరోసారి ఇంట్లోకి పంపించవచ్చు. ఓటింగ్‌ లైన్స్‌ ఈ రోజు 11 గంటలకు ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఎలిమినేట్ అయినవారు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవచ్చు. అయితే ఈ నిర్ణయంపై నెటిజన్లు వ్యతిరేకిస్తున్నారు. తేజస్వీ రీఎంట్రీ కోసమే అవకాశం కల్పించారని పలువురు ఆరోపిస్తుండగా కొందరు నూతన్‌ నాయుడు, శ్యామలకు ఓటేయ్యాలని పిలుపునిస్తున్నారు.
మీరు మనుషులేనా? ఇంత విషమా? సిగ్గుపడాలి.. నాని ఫైర్! తేజస్విపై అసభ్యంగా..!

మీరు మనుషులేనా? ఇంత విషమా? సిగ్గుపడాలి.. నాని ఫైర్! తేజస్విపై అసభ్యంగా..!

నేచురల్ స్టార్ నాని చాలా కూల్‌గా నవ్వుతూ కనిపిస్తారు. ఆయనకు నిజంగా కోపం వస్తుందా అనే అనుమానం కలుగకమానదు. అలాంటిది ఆదివారం ప్రసారమైన బిగ్‌బాస్ షోలో నెటిజన్లపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో వారు మాట్లాడుతున్న భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లపై నాని సీరియస్ అయ్యారు. నాని ఆగ్రహం ఆయన మాటల్లోనే..బిగ్‌బాస్ హోస్ట్‌గా నా బాధ్యతను బాగానే నిర్వర్తిస్తున్నాను. ఓ మనిషిగా ఒక విషయం చెప్పాలనుకొంటున్నాను. రీసెంట్‌గా బిగ్‌బాస్ టీమ్ నాకు ఓ ప్రజెంటేషన్ ఇచ్చారు.

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more