Short News

ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 15 నుండి  22 వరకు

ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 15 నుండి 22 వరకు

ప్రతి వారం, తన ముగింపును ఎలా ఇస్తుంది అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అలాంటి ప్రశ్నల నివృత్తికై మా జ్యోతిష్య శాస్త్ర పండితులు మీకు పూర్తి వివరాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు.

మా జ్యోతిష్య శాస్త్ర పండితుల వివరాల ప్రకారం, మీ రాశిచక్రాలు ఈ వారం ఎటువంటి ఫలితాలను ఇవ్వనున్నాయో క్రింద పొందుపరచబడ్డాయి. తద్వారా మీరు ఏమైనా ప్రతికూల ప్రభావిత పరిస్థితులు ఎదురైన సందర్భాలలో మిమ్ములను మీరు సిద్దపరచుకునేలా తయారవ్వగలరు. ఈ రాశిఫలాలు ఏప్రిల్ 15 నుండి 22 వరకు మాత్రమే. గుర్తుంచుకోండి: ఈ రాశి ఫలాలు సూర్య మాన సిద్దాంత ప్రకారం ఉంటుంది.

చంద్రబాబుకు గవర్నర్ ఫోన్

చంద్రబాబుకు గవర్నర్ ఫోన్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ బుధవారం సాయంత్రం ఫోన్ చేశారు. విశాఖ, శ్రీకాకుళంలోని సముద్ర తీరప్రాంత పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. తీరప్రాంతంలో విపరీత వాతావరణ పరిస్థితులపై ఫోన్‌లో అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచాలని, నిత్యావసర వస్తువులు, సహాయ సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. దక్షిణ మహాసముద్రంలో అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా తయారైంది. ఉత్తర కోస్తా సముద్రతీరంలో అలల ఉద్ధృతి పెరిగింది.

బ్రహ్మాజీ ఉంటే 99 శాతం విజయమే

బ్రహ్మాజీ ఉంటే 99 శాతం విజయమే

మహేశ్ బాబు నటించిన 'భరత్‌ అనే నేను' చిత్రంలో బ్రహ్మాజీ కీలక పాత్ర పోషించాడు. సీఎం భరత్‌కు పర్సనల్‌ సెక్రటరీ భాస్కర్‌ పాత్రలో హాస్యం పండించారు. విజయోత్సవ వేడుక సందర్భంగా మహేశ్‌ బ్రహ్మాజీ గురించి మాట్లాడుతూ 'నేను, బ్రహ్మాజీ నటించిన సినిమాలు 99 శాతం విజయం సాధించాయి' అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ 'అరుదైన నటుడు, నేచురల్‌ యాక్టర్‌, అతను ఏ సన్నివేశంలోనైనా హాస్యాన్ని, భావోద్వేగాన్ని పండించగలరు' అని చెప్పుకొచ్చారు.  
నింగికెగిసిన సోగ్గాడు: చిన్నబోయిన సింహపురి

నింగికెగిసిన సోగ్గాడు: చిన్నబోయిన సింహపురి

ఆనం వివేకానందరెడ్డి(67) ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూస్తాయి. సింహపురి సోగ్గాడిగా పేరు తెచ్చుకున్న ఆయన మృతితో నెల్లూరు జిల్లా చిన్నబోయింది. సుమారు రెండు నెలలకు పైగా ప్రొస్టేట్ క్యాన్సర్‌తో పోరాడిన ఆయన బుధవారం ఉదయం చికిత్స పొందుతూ హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. కాగా, ఈ విషయం తెలిసిన నెల్లూరు అభిమానులు, ప్రజలు విషాదంలో మునిగిపోయారు. రాజకీయాల్లో విలక్షణ నేతగా గుర్తింపు తెచ్చుకున్న వివేకానందరెడ్డి.. ఇక లేరనే విషయాన్ని జిల్లా ప్రజలు, నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.