Short News

మీ రాశిచక్రం ప్రకారం, మీకు సరిపడే పెంపుడు జంతువేదో తెలుసుకోండి !

మీ రాశిచక్రం ప్రకారం, మీకు సరిపడే పెంపుడు జంతువేదో తెలుసుకోండి !

ఒక వ్యక్తి రాశిచక్రము ఆధారంగా అతని వ్యక్తిత్వము & ఇతర గుణగణాలు గూర్చి మనము పూర్తిగా తెలుసుకోవచ్చు. కానీ ఇదే రాశిచక్రము ఆధారంగా మీకు సరిపడే పెంపుడు జంతువు గూర్చి కూడా తెలుసుకోగలరని మీకు తెలుసా?

పెంపుడు జంతువుల జ్యోతిష్యశాస్త్ర ప్రకారం, మీకు సరిపడే పెంపుడు జంతువులను గూర్చి తెలుసుకోవటమనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ మీరు మీ వ్యక్తిత్వానికి సరిపోయిన పెంపుడు జంతువులను ఎంచుకున్నప్పుడు మీకు మరింత లాభదాయకంగా ఉంటుందని మీకు తెలుసా ?మీ రాశిచక్రము ఆధారంగా

రాధిక కుమారస్వామిని చూశారా..?

రాధిక కుమారస్వామిని చూశారా..?

ఓవైపు కర్నాటక రాజకీయ పరిణాలపై దేశమంతా చర్చిస్తుంటే మరోవైపు కుమారస్వామి సతీమణి గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. నెటిజన్లు గూగుల్‌లో కుమారస్వామి పర్సనల్ ప్రొఫైల్ గురించి వెతకడం ప్రారంభించారు. సెర్చింగ్ సమయంలో కుమారస్వామి రెండో భార్య రాధిక అనూహ్యంగా తెరపైకి వచ్చారు. రాధికా కుమారస్వామి మే 18న గూగుల్ సెర్చింగ్‌లో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న వ్యక్తిగా నిలిచారు. రాధిక ఎవరో కాదు ప్రముఖ కన్నడ నటి. కన్నడ సినిమాల్లో రాధిక హీరోయిన్‌గా నటించారు. వీరికి షమికా కే స్వామి అనే కూతురు కూడా ఉంది. రాధికకు కూడా ఇది రెండో వివాహం.
ఈ చిరునవ్వుల కోసమే 24 గంటలుగా నిద్రపోలేదు

ఈ చిరునవ్వుల కోసమే 24 గంటలుగా నిద్రపోలేదు

శనివారం రాత్రి ఉప్పల్ వేదికగా జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను దాని సొంతగడ్డపైనే ఓడించి కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ ఉత్కంఠభరిత విజయంపై కోల్‌కతా ఫ్రాంఛైజీ సహయాజమాని, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ చిరునవ్వులు చూసేందు కోసమే 24 గంటలుగా మెలకువతోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఇక నిద్రపోలేను అని ట్వీట్ చేశాడు. దినేశ్ కార్తీక్, నరైన్ నవ్వుతున్న ఫొటోలను షేర్ చేశాడు.
వైయస్ ఉన్నప్పుడు రమణదీక్షితులు మాట్లాడలేదేం: టీటీడీ చైర్మన్

వైయస్ ఉన్నప్పుడు రమణదీక్షితులు మాట్లాడలేదేం: టీటీడీ చైర్మన్


మణదీక్షితులు ఆరోపణలపై టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆదివారం స్పందించారు. దీక్షితులు ఆరోపణలు సరికాదన్నారు. ఆయనపై టీటీడీకి ఎలాంటి కక్ష సాధింపు లేదని చెప్పారు. గతంలో ఎప్పుడూ చేయని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. టీటీడీ బోర్డు భక్తుల సేవకే గానీ పెత్తనానికి కాదన్నారు. రమణ దీక్షితులే కాదని, సామాన్య భక్తులు కూడా తీసుకు వచ్చిన అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి - కరుణాకర్ రెడ్డి హయాంలో రమణదీక్షితులు ఎందుకు మాట్లాడలేదన్నారు.