Short News

తొలి టి20లో భారత మహిళల విజయం

తొలి టి20లో భారత మహిళల విజయం

దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టి20లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య టీమ్‌ను 7 వికెట్లు తేడాతో చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది.  
హైదరాబాద్ లో ఏప్రిల్ 23న పెట్రోలు, డీజిల్ ధరలు

హైదరాబాద్ లో ఏప్రిల్ 23న పెట్రోలు, డీజిల్ ధరలు

పెట్రోల్‌ ధరలు తొలిసారి రికార్డు స్థాయికి చేరాయి. దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.74.04కు చేరగా, డీజిల్‌ ధర రూ.65.65 చేరి, ఆల్‌టైమ్‌ రికార్డు ధరను నమోదు చేసింది. ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలన్నీ గతేడాది జూన్‌ నుంచి రోజు వారీగా పెట్రోలు ధరల సవరిస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు పెట్రోల్‌ ధర 11 పైసలు పెరిగింది. ఈ మేరకు సోమవారం లీటరు పెట్రోల్‌ ధర 78.90కు చేరింది. డీజిల్‌ ధర 11పైసలు పెరిగి అత్యధికంగా రూ.71.44కు చేరింది. 
అందుకే 'ఏబీడి' బెస్ట్‌ ప్లేయర్‌‌

అందుకే 'ఏబీడి' బెస్ట్‌ ప్లేయర్‌‌

సొంతగడ్డపై బెంగళూరు చెలరేగిపోయింది. ఏబీ డివిలియర్స్‌ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని అవలీలగా దాటించేసాడు. శనివారం జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ అనంతరం ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ 'మా జట్టులో చిరునవ్వులకు కారణం ఏబీడీనే. తనదైన శైలిలో రెచ్చిపోయి ప్రత్యర్థి జట్టు నుంచి మ్యాచ్‌ను లాక్కున్నాడు. ఈ కారణంగానే అతణ్ని ప్రపంచంలోనే ఉత్తమ ఆటగాడు అనటంలో ఎలాంటి సందేహం లేదని' కితాబిచ్చాడు. 
చివర్లో మెరిసిన గౌతమ్‌ ..ముంబయిపై రాజస్థాన్‌ విజయం

చివర్లో మెరిసిన గౌతమ్‌ ..ముంబయిపై రాజస్థాన్‌ విజయం

రాజస్థాన్‌ రాయ‌ల్స్‌ తిరిగి గెలుపు బాట పట్టింది. బ్యాటుతో సంజు శాంసన్‌, గౌతమ్‌ బంతితో ఆర్చర్‌ మెరిసిన వేళ ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (72), ఇషాన్‌ కిషన్‌ (58) మెరవడంతో మొదట ముంబయి 7 వికెట్లకు 167 పరుగులు సాధించింది. సంజు శాంసన్‌ (52), స్టోక్స్‌ (40), గౌతమ్‌ (33 నాటౌట్‌) రాణించడంతో లక్ష్యాన్ని రాజస్థాన్‌ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టోర్నీలో రాజస్థాన్‌కు ఇది మూడో విజయం కాగా ముంబయికి నాలుగో పరాజయం.