Short News

నేటి నుంచే ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌

నేటి నుంచే ఆల్‌ ఇంగ్లాండ్‌ ఛాంపియన్‌షిప్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత పురాతనమైన, వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న టోర్నీ 'ఆల్‌ఇంగ్లండ్ ఓపెన్'. భారత్ తరపున ప్రకాశ్‌ పదుకొనె ఆల్‌ ఇంగ్లాండ్‌ ట్రోఫీ అందుకుని 38 ఏళ్ళు కాగా గోపీచంద్‌ ఈ టోర్నీ నెగ్గి 17 ఏళ్ళు దాటాయి. 2002 నుంచి భారత్‌కు ఆల్‌ ఇంగ్లాండ్‌ అందని ద్రాక్షే. ఈ తరుణంలో భారత షట్లర్లు సైనా, సింధు, శ్రీకాంత్‌, సాయిప్రణీత్, ప్రణయ్ లు ప్రతిష్టాత్మక టోర్నీలో తమ సత్తా పరీక్షించుకోనున్నారు.
ఎపి గురించి ఇంత జరుగుతుంటే...చిరంజీవి ఎక్కడా...?

ఎపి గురించి ఇంత జరుగుతుంటే...చిరంజీవి ఎక్కడా...?

అమరావతి: ఎపికి ప్రత్యేక హోదా విషయమై ఢిల్లీలో అల్లకల్లోలం జరుగుతుంటే కాంగ్రెస్‌ ఎంపి అయిన చిరంజీవి ఎక్కడా కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాజ్యంగపరంగా ఏ హోదా లేని తమ్ముడు పవన్ కళ్యాణ్ సైతం ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే రాష్ట్రానికి చెందిన ఎంపి అయ్యుండి చిరంజీవి

పోరాటంలో కనిపించడం అటుంచి కనీసం నోరు మెదపకపోవడం ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేస్తోంది. ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొనక పోగా ఆదివారం రంగస్థలం ఆడియో వేడుకల్లో చిరంజీవి పాల్గొని స్పీచ్ లు దంచడం ఆయనపై విమర్శలకు మరింత ఆజ్యం పోసింది.

ఆర్టెరీస్ ను క్లీన్ చేసి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించే ఆహారాలు

ఆర్టెరీస్ ను క్లీన్ చేసి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించే ఆహారాలు

గుండె ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టేనన్న ప్రాచీన చైనీజ్ సూక్తిలో ఎంతో అర్థం ఇమిడి ఉంది. గుండెకున్న ప్రాముఖ్యతను ఈ సూక్తి పునరుద్ఘాటిస్తోంది. గుండె అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో ప్రముఖ స్థానాన్ని పొందినది. దీని ఆరోగ్య ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపై నేరుగా పడుతుంది.

గుండె ఆరోగ్యానికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు శరీరంలోని మిగతా భాగాలపై పడటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ ను అనుభవించాల్సి వస్తుంది.

సిల్లీ ఫెల్లోస్: అల్లరి నరేష్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

సిల్లీ ఫెల్లోస్: అల్లరి నరేష్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్

టాలీవుడ్ కామెడీ స్టార్ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్‌లో జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'సిల్లీ ఫెల్లోస్' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో కామెడీ హీరో సునీల్ కూడా చాలా కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తనున్నారు. అల్లరి నరేష్, భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్లో గతంలో 'సుడిగాడు' అనే ఫుల్ కామెడీ సినిమా వచ్చింది.