Short News

'దీపిక-జోష్న' ఖాతాలో కామన్వెల్త్ 500వ పతకం

'దీపిక-జోష్న' ఖాతాలో కామన్వెల్త్ 500వ పతకం

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత పతకాల సంఖ్య 500 మార్కును దాటింది. ఆదివారం ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో 64వ పతకం భారత్ ఖాతాలో చేరగానే ఈ మైలురాయిని చేరుకుంది. ఈ పతాకాన్ని స్క్వాష్‌ విభాగంలో మహిళల డబుల్స్‌లో 'దీపిక పల్లికల్‌-జోష్న చినప్ప' అందుకున్నారు. భారత జంట 9-11, 8-11తో న్యూజిలాండ్‌ ద్వయం జోయెల్‌-లెండర్స్‌ చేతిలో ఓడి రజతం అందుకున్నారు. ఇప్పటివరకూ ఈ క్రీడల్లో 17సార్లు పోటీపడ్డ భారత్‌ మొత్తంగా 504 పతకాలు గెలుచుకుంది. ఇందులో 181 స్వర్ణాలు, 175 రజతాలు 148 కాంస్యాలు ఉన్నాయి. ఈ క్రీడల్లో తొలి పతకం 1934లో రెజ్లర్‌ రషీద్‌ అన్వర్‌ సాధించాడు.
అబూ సలెం పెరోల్ దరఖాస్తు తిరస్కరణ

అబూ సలెం పెరోల్ దరఖాస్తు తిరస్కరణ

బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన గ్యాంగ్ స్టర్ అబూసలేం రెండో పెళ్లి కోసం పెట్టుకున్న పెరోల్ దరఖాస్తును నవీ ముంబై పోలీసు కమిషనర్ తిరస్కరించారు. 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల కేసులో 257 మంది మరణించగా, 713 మంది గాయపడ్డారు. ఈ కేసులో కీలక దోషి అయిన అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ నేపథ్యంలో జైలులో ఉన్న అబూ సలేం తాజాగా తాను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తనకు 45రోజుల పాటు పెరోల్ ఇవ్వాలని అభ్యర్థించాడు. అయితే పెరోల్ దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు.
మరోసారి తండ్రి కాబోతున్న షాహిద్‌ కపూర్‌

మరోసారి తండ్రి కాబోతున్న షాహిద్‌ కపూర్‌

బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్త సందడి చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షాహిద్‌ షేర్ చేసిన మిషా ఫొటోలో బిగ్‌ సిస్టర్‌ అనే అక్షరాలు ఉండటం దీనికి మరింత బలం చేకూర్చుతోంది. షాహిద్‌- మీరా దంపతులు మరో బేబీని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నారంటూ కామెంట్‌ చేస్తున్నారు. మీరా రాజ్‌పుత్‌ ప్రెగ్నెంట్‌ అంటూ బీ టౌన్‌లో ఇప్పటికే వదంతులు ప్రచారం అవుతున్నాయి. షాహిద్‌ కపూర్‌ 2015లో మీరా రాజ్‌పుత్‌ను పెళ్ళాడాడు. షాహిద్‌ ప్రస్తుతం శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వంలో సభట్టీ గుల్‌ మీటర్‌ చాలూ' సినిమాలో నటిస్తున్నాడు. 
వొడాపోన్ రోజుకి 2జిబి డేటా ప్లాన్, టార్గెట్ ఆ రెండే !

వొడాపోన్ రోజుకి 2జిబి డేటా ప్లాన్, టార్గెట్ ఆ రెండే !

దేశీయ టెలికాం రంగం రోజురోజుకు పెను విప్లవాల వైపుగా దూసుకుపోతోంది. జియో రాకతో పోటీవాతావరణం వేడెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఉచిత ఆఫర్లతో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన జియోని ఢీకొట్టడమే లక్ష్యంగా మిగతా టెల్కోలు ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులు తమ నుంచి చేజారిపోకుండా కాపాడుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోనే ప్రధాన పోటీదారులైన జియో, ఎయిర్‌టెల్‌తో సమానంగా వొడాఫోన్‌ సరికొత్త ప్లాన్‌తో ప్రజల ముందుకు వచ్చింది. 28 రోజుల పాటు రోజుకు 2జిబి డేటాను అందించే ప్లానుతో యూజర్లను ఆకట్టుకునేందుకు రెడీ అయింది.