Short News

పాతికేళ్ళ నిరీక్షణ ముగిసింది ..ఈ జట్టు ప్రత్యేకమైనది

పాతికేళ్ళ నిరీక్షణ ముగిసింది ..ఈ జట్టు ప్రత్యేకమైనది

25ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ సఫారీ గడ్డపై టీమిండియా తొలి సిరీస్‌ విజయాన్ని అందుకుంది. మంగళవారం జరిగిన ఐదో వన్డేలో టీమిండియా విజయం సాధించి 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపధ్యంలో మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద సంఖ్యలో కోహ్లీ సేనపై ప్రశంసల జట్టు కురిపిస్తున్నారు. సఫారీ గడ్డపై దుమ్మురేపిన భారత క్రికెట్‌ జట్టుకు అభినందనలు తెలుపుతూ ఈ జట్టు ఎంతో ప్రత్యేకమైనదని కొనియాడారు.
ట్విస్ట్: కన్నా లక్ష్మీనారాయణతో టీడీపీ చర్చలు!

ట్విస్ట్: కన్నా లక్ష్మీనారాయణతో టీడీపీ చర్చలు!

మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అంశంలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయన.. తనకు పదవి రాకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తేదీని కూడా ఖరారు చేశారు. అయితే, అనారోగ్యం కారణంతో ఆయన తన చేరికను వాయిదా వేసుకున్నారు. ఈ నెల 25వ తేదీన వైసీపీలో చేరాలనుకున్న కన్నా.... వైసీపీ అధినేత జగన్‌కు బీజేపీ అధ్యక్షులు అమిత్ షా మెసేజ్ కారణంగా ప్రతిష్టంభన నెలకొందని అంటున్నారు. ఇదిలా ఉండగా, మరోవైపు టీడీపీ నేతలు కన్నా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

సరికొత్త పురుష గర్భనిరోధక మాత్రల గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

సరికొత్త పురుష గర్భనిరోధక మాత్రల గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

శాస్త్రవేత్తలు పురుష గర్భనిరోధక మాత్రలను కల్పన చేయడానికి ఒక అడుగు దగ్గరగా వచ్చారనే ఒక కొత్త పరిశోధన వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్ల కలయిక ద్వారా ఉత్పత్తి చేసిన గర్భనిరోధక మాత్రలు కేవలం స్త్రీలు వినియోగించడానికి సరిపడే విధంగా ఉండేవి. వీటివల్ల బరువు పెరగడం, వికారం మరియు కల్లోల మానసిక స్థితి వంటి సమస్యలు తలెత్తుతాయి.

పురుష గర్భనిరోధక మాత్రల గురించి మీరు ఇక్కడ తెలుసుకోవలసిన విషయాలు ఏమిటంటే:

'ఈసారి కప్ మాదే' అంటున్న డివిలియర్స్

'ఈసారి కప్ మాదే' అంటున్న డివిలియర్స్

టీ20 లీగ్-2018లో బెంగళూరు తరపున ఆడుతున్న సఫారీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఆటోలో సందడి చేసాడు. గురువారం భార్య, కుమారుడితో కలిసి బెంగళూరు వీధుల్లో చక్కర్లు కొట్టాడు. అభిమానులు డివిలియర్స్‌ను గుర్తుపట్టేసి ఆటోను అనుసరించారు. 'ఈ సారి కప్‌ మాదే' అంటూ సందడి డివిలియర్స్‌ అభిమానులతో పాటు సందడి చేసాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లాడిన బెంగళూరు రెండు విజయాలు, నాలుగు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఢీకొట్టనుంది.