
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" ఆడియో ఫంక్షన్ మిలటరీ మాధవరంలో ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగబాబు బన్నీ గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. అల్లు అర్జున్ గురించి మాత్రమే కాకుండా తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి, అన్నయ్య చిరంజీవి గురించి కూడా ప్రస్తావించారు.
తన సోదరుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారని, వారి దుమ్ము దులిపేందుకు కళ్యాణ్ వస్తున్నాడని మెగా బ్రదర్ నాగబాబు అన్నారు. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య -నా ఇల్లు ఇండియా సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాట్లాడొచ్చో లేదో తెలియదు కానీ అంటూ పవన్ అంశంపై స్పందించారు. పవన్, చెర్రీ, బన్నీ ఇలా మెగా కుటుంబానికి మొత్తానికి చిరంజీవి దారి చూపించారని అందుకు అన్నయ్యకు థ్యాంక్స్ అన్నారు.