Short News

రైనా పున‌రాగ‌మ‌నం.. గంగూలీ సాయం

రైనా పున‌రాగ‌మ‌నం.. గంగూలీ సాయం

సౌరభ్‌ గంగూలీని కలిసి మాట్లాడిన మాటలు తనకు ఎంతో ఉపయోగిపడినట్లు భార‌త జ‌ట్టులో చాలా కాలం చోటు కోల్పోయిన రైనా తెలిపాడు. ‘సయ్యద్ ముస్తాక్‌ అలీ టోర్నీలో బెంగాల్‌పై జరిగిన మ్యాచ్‌ నా భవిష్యత్తును మార్చింది. మ్యాచ్‌ తర్వాత నేను, హ‌ర్భ‌జ‌న్‌ గంగూలీ ఇంటికి డిన్నర్‌కి వెళ్లాం. 2006లో ఎలా అయితే జట్టులో స్థానం కోసం ఎంత కష్టపడ్డానో ఆ సందర్భంగా గుర్తు చేశాడు గంగూలీ. ఇక అప్పటి నుంచి మరో ఆలోచన లేకుండా ఫిట్‌నెస్‌ సాధించడం, ఫామ్‌పై దృష్టి పెట్టడం చేశా. అప్పుడు గంగూలీతో మాట్లాడటం నాకు ఎంతో కలిసి వచ్చింది' అని రైనా వివరించాడు.   
స్మార్ట్ ఫోన్ల వ్య‌వ‌సం నుంచి కాపాడే చిట్కాలివే..

స్మార్ట్ ఫోన్ల వ్య‌వ‌సం నుంచి కాపాడే చిట్కాలివే..

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లకు వశం కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఐదు చిట్కాలు అందిస్తున్నారు నిపుణులు. మొద‌టిది మొబైల్ డేటా ఆఫ్ చేయ‌డం. దీని ద్వారా మెసేజ్‌లు, నోటిఫికేషన్లతో పనికి అంతరాయం కలగకుండా ఉంటుందని చెబుతున్నారు. రెండోది రోజులో కొంత సమయం గ్యాడ్జెట్స్ ప‌క్క‌న పెట్టి ఆటలు, సంగీతం, సమాజ సేవ వంటి వాటికి స‌మ‌యం కేటాయించడం. మూడోది ఫోన్లో అన‌వ‌స‌ర క‌బుర్లు చెప్ప‌డం ఆపాలి. నాలుగు.. నిద్ర‌పోయే ముందు సెల్ ఫోన్ వాడొద్దు. చివ‌రిది.. కొన్నాళ్లు సాధార‌ణ మోడ‌ల్ ఫోన్ వాడండి.   
లోకేష్ గురించి చెప్పేదేముంది, అంతా వాళ్లిష్టం: పవన్ కళ్యాణ్

లోకేష్ గురించి చెప్పేదేముంది, అంతా వాళ్లిష్టం: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చాపురంలో ప్రసంగిస్తుండగా మంత్రి నారా లోకేష్ గురించి మాట్లాడాలని జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ సెటైరిక్‌గా మాట్లాడారు. లోకేష్ గురించి చెప్పేదేముందని వ్యాఖ్యానించారు. ఆయన ఎవరో మీ అందరికీ తెలుసునని, ముఖ్యమంత్రి గారి కొడుకు అని, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నారు. ప్రభుత్వం, ఖజానా, తాళాలు అన్నీ వాళ్ల చేతుల్లో ఉన్నాయన్నారు. అంతా వాళ్లిష్టమని, వాళ్లేమైనా చేసుకోనీ అన్నారు.

మాధురి దీక్షిత్ డ్యాన్స్‌.. ఆన్‌లైన్లో వైర‌ల్‌

మాధురి దీక్షిత్ డ్యాన్స్‌.. ఆన్‌లైన్లో వైర‌ల్‌

బాలీవుడ్ అందాల నటి మాధురీ దీక్షిత్ డ్యాన్స్ చేసిందంటే అందరూ ఫిదా అవ్వాల్సిందే. ఐదు పదుల వయసులోనూ తన డ్యాన్స్ ఫర్‌ఫార్మెన్స్‌తో మరోసారి మెస్మరైజ్ చేసింది మాధురీ. రేణుక సహానే, మాధురీ 1994లో వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్' చిత్రంలోని సీన్ ను మరోసారి రిపీట్ చేశారు ఈ ఇద్దరు తారలు. మాధురీ తాజాగా బకెట్ లిస్ట్ అనే మరాఠీ డెబ్యూట్ మూవీ చేస్తుంది. ఈ సినిమా సెట్స్‌లో మాధురీ తన కోస్టార్ రేణుక సహానేతో కలిసి డ్యాన్స్ చేసి అదరహో అనిపించింది. ఈ డ్యాన్స్ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.