Short News

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌, భారత్‌ మధ్య రెండో టీ20 ప్రారంభమైంది. తొలుత టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మహ్మదుల్లా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌ స్సినర్లకు అనుకూలంగా ఉండటంతో బౌలింగ్‌ ఎంచుకున్నట్లు బంగ్లా సారథి మహ్మదుల్లా తెలిపాడు. బంగ్లా జట్టులో టాస్కిన్‌ స్థానంలో అబూ హిడేర్‌ రూనే రాగా, భారత జట్టులో పేస్‌ బౌలర్‌ స్థానంలో మహ్మద్‌ సిరాజ్‌కు అవకాశం దక్కింది.
టెక్కీల ఇళ్లే టార్గెట్: వరుస చోరీలతో రెచ్చిన దొంగల ముఠా, అర

టెక్కీల ఇళ్లే టార్గెట్: వరుస చోరీలతో రెచ్చిన దొంగల ముఠా, అర

బెంగళూరు నగరంలో మరో దొంగల ముఠా ఆట కట్టించారు పోలీసులు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, విద్యార్థులు నివాసముండే గృహాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న పంజాబ్‌కు చెందిన ఓవ్యక్తితోపాటు ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.42 లక్షల విలువ చేసే 1.89 కిలోల బంగారు నగలు, కిలో వెండి వస్తువులు, 17 ల్యాప్‌టాప్‌లు, ఐదు కెమేరాల్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తును బెంగళూరులో అదనపు పోలీసు కమిషనర్‌ సీమంత్‌కుమార్‌ సింగ్‌ సొంతదారులకు అందజేశారు.

అమెరికా,  చైనా మధ్య ముదురుతున్న ‘ట్రేడ్‌వార్‌ ’

అమెరికా, చైనా మధ్య ముదురుతున్న ‘ట్రేడ్‌వార్‌ ’

అమెరికా చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ ముదురుతోంది. చైనా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధిస్తూ ట్రంప్‌ ప్రభుత్వం గురువారం సంతకం చేసింది. దీనిపై కౌంటర్ ఎటాక్ చేసిన చైనా.. తమ దేశంలో అమెరికా వస్తువుల దిగుమతులకు చెక్‌ పెట్టేందుకు జీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించింది. త్వరలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ను ఆశ్రయించనుంది. అమెరికాపై చట్టపరమైన చర్యలను కోరనున్నామని చైనా ఒక ప్రకటనలో తెలిపింది.
ఎడ్డేమంటే తెడ్డెం: డిజిటల్ చెల్లింపులకు సర్కార్ సహకారం

ఎడ్డేమంటే తెడ్డెం: డిజిటల్ చెల్లింపులకు సర్కార్ సహకారం

డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి కేంద్రం చర్యలు ప్రతిపాదిస్తూ ఉంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకంపై ఎడాపెడా ఫీజు వసూలు చేస్తున్నాయి.చెక్‌కు సరిపడా బ్యాంకు ఖాతాలో నగదు లేకపోతే సంబంధిత ఖాతాదారుడిపై భారీగా జరిమానా వడ్డిస్తున్నాయి బ్యాంకులు. కనుక బ్యాంకుల నుంచి వచ్చిన ఎస్సెమ్మెస్‌ల ఆధారంగా లావాదేవీలు జరుపాలని కోరుతున్నారు.ఇక ఎస్బీఐ, దాని అనుబంధ బ్యాంకులు జారీ చేసిన చెక్కులు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి చెల్లబోవని తేల్చేసింది.