Short News

ఏథర్‌ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు..

ఏథర్‌ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు..

కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ టూ వీలర్‌ తయారీ సంస్థ ఏథర్‌ ఎనర్జీ(Ather Energy) గుడ్‌ న్యూస్‌ తీసుకువచ్చింది. ఏథర్‌ ఎనర్జీ నుంచి భారీ అంచనాలతో త్వరలో విడుదల కాబోతున్న ఫ్యామిలీ స్కూటర్‌ రిజ్టా(Ather Rizta)కు సంబంధించి ప్రీ బుకింగ్‌లను సంస్థ ప్రారంభించింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..
రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్‌ AMT కొత్త వేరియంట్లు విడుదల..

రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్‌ AMT కొత్త వేరియంట్లు విడుదల..

స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors).. తన ప్రముఖ మోడల్‌ నెక్సాన్ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ లైనప్‌ను మరింత విస్తరించింది. నెక్సాన్‌లో ఇప్పుడు 5 కొత్త వేరియంట్లను ఆటోమేటెడ్‌ మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌(AMT) వెర్షన్‌లో తీసుకువచ్చింది. ధర, ఇతర వివరాలు పూర్తి సమాచారం ఈ కథనంలో...
కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి

కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి

ఏ కూతురికైనా నాన్నే సూపర్ హీరో. నాన్నలు కూడా తమ కుమార్తెల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. ఇటీవల గోవాకు చెందిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ 'మైఖేల్ లోబో' ఇటీవల ఖరీదైన కారును కుమార్తెకు గిఫ్ట్ ఇచ్చారు. మైఖేల్ లోబో తన కూతురికి గిఫ్ట్ ఇచ్చిన కారు 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) కంపెనీకి చెందిన 'ఎస్ఎల్55 ఏఎంజీ' (SL55 AMG). దీని ధర రూ. 2.7 కోట్లు. ఈ కారును మైకేల్ లోబో కుమార్తె గోవాలోని మెర్సిడెస్ బెంజ్ డీలర్‌షిప్ నుంచి డెలివరీ తీసుకుంటూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్‌ కారు లాంచ్‌.. 810 కి.మీ రేంజ్‌

టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్‌ కారు లాంచ్‌.. 810 కి.మీ రేంజ్‌

చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi తన తొలి ఎలక్ట్రిక్ కారు SU7 లాంచ్‌తో అధికారికంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్లోకి ప్రవేశించింది. గురువారం Xiaomi SU7ని సంస్థ విడుదల చేసింది. టెస్లా మరియు BYD వంటి టాప్‌ కంపెనీల మోడళ్లకు గట్టిపోటీగా Xiaomi ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని విడుదల చేసింది.