Short News

ట్రై సిరీస్ కోసం భారత మహిళ జట్టు ఎంపిక

ట్రై సిరీస్ కోసం భారత మహిళ జట్టు ఎంపిక

ఆస్ట్రేలియా మహిళ జట్టు, ఇంగ్లాండ్ మహిళ జట్టుతో జరుగనున్న పేటీఎం ట్రైసిరీస్ కోసం భారత మహిళ జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ముంబై వేదికగా మార్చి 22 నుంచి 31 వరకూ ఈ సిరీస్ జరుగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, మిథాలీ రాజ్, వేదా కృష్ణమూర్తి, జెమియా రోడ్రిగ్యూస్, అనుజా పాటిల్, దీప్తీ శర్మ, తానియా భట్(కీపర్), పూనమ్ యాదవ్, ఏక్తా బిస్త్, ఝులన్ గోస్వామి, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, రుమేలీ ధార్, మోనా మెష్రం తో ట్రై సిరీస్ లో టీమ్ ఆడనుంది. గాయం కారణంగా దూరమైన కీలక బౌలర్ ఝలున్ గౌస్వామి ఈ జట్టులో తిరిగి స్థానం సంపాదించుకుంది.
'మెగా' పోజు వైరల్ అయ్యింది

'మెగా' పోజు వైరల్ అయ్యింది

మెగా కుటుంబ సభ్యులున్న ఓ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‌చిరంజీవి‌, ఆయన సతీమణి సురేఖతోపాటు రామ్‌చరణ్‌, అల్లు అరవింద్‌ కలిసి ఛార్టెడ్‌ ఫ్లైట్‌లో‌ దిగిన ఫొటో అది. ఇందులో చిరు తన తనయుడు చెర్రీపై కాలు వేసుకుని, సేద తీరుతూ కనిపించారు. కుటుంబ సభ్యులు కలిసి సరదాగా సమయం గడుపుతున్నప్పుడు తీసిన ఈ ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. పవన్‌ ‘తీన్‌మార్‌' సినిమా సెట్‌లో తన కుమారుడు అకీరా నందన్‌తో ఇదే పోజులో ఫొటో దిగారు. ఇప్పుడు ఈ రెండు ఫొటోలను అభిమానులు సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అన్నదమ్ముల అలవాట్లు ఒకటేనని కామెంట్లు చేస్తున్నారు. 
ఉబర్‌, ఓలా డ్రైవర్ల సమ్మె 'సైరన్'

ఉబర్‌, ఓలా డ్రైవర్ల సమ్మె 'సైరన్'

ముంబై నగర వ్యాప్తంగా ఓలా, ఉబర్‌ క్యాబ్‌ల సేవలు నిలిచిపోయాయి. మహారాష్ట్ర నవ్‌ నిర్మాణ సేన(ఎంఎన్‌ఎస్‌) సంఘ సభ్యులు డ్రైవర్ల సదుపాయాల మెరుగుదల కోసం సమ్మెకు పిలుపునిచ్చారు. సుమారు 80,000మంది డ్రైవర్లకు పైగా సమ్మెలో పాల్గొని మద్ధతిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సమ్మెను నాసిక్‌, పుణె, దిల్లీ, బెంగళూరు నగరాలకూ విస్తరిస్తామని తెలిపారు. డిమాండ్ల విషయంలో కంపెనీలు, ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకూ సమ్మె కొనసాగుతుందని చెపుతున్నారు.  
ఇవిగో ఆధారాలు.. పవన్ అమరావతి ఇంటిపై జనసేన ట్వీట్

ఇవిగో ఆధారాలు.. పవన్ అమరావతి ఇంటిపై జనసేన ట్వీట్

అత్యంత ఖరీదైన అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండెకరాల భూమిని అతి తక్కువ ధరకే కొన్నారనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ఈ విమర్శలను తిప్పికొడుతూ.. జనసేన అధికారిక ట్విట్టర్ పేజ్‌లో ఆ స్థలం ఎప్పుడు కొన్నది? ఎంతకు కొన్నది? ఎవరి వద్ద కొన్నది వంటి పూర్తి వివరాలతో డాక్యుమెంట్స్‌ను ఆధారాలుగా చూపిస్తూ ట్వీట్ పెట్టింది జనసేన.
అధికారికంగా రిజిస్ట్రేషన్ ఫీజులన్నీ చెల్లించే అక్కడ ఇళ్లు కడుతున్నట్టు అన్ని ఆధారాలను ట్వీట్‌లో పొందుపరిచారు.