Short News

‘మిస్‌ యు బెబో’  అంటూ షమీ ట్విట్

‘మిస్‌ యు బెబో’ అంటూ షమీ ట్విట్

షమి భార్య హసీన్‌ జహాన్‌ గత వారం రోజులుగా షమిపై సంచలన ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మహమ్మద్‌ షమి తాజాగా ట్విటర్‌ ద్వారా ఓ ఫొటోను పంచుకున్నాడు. ఫొటోలో ఐరా ముందు బోలెడు చాక్లెట్లు కనిపిస్తాయి. ఈ ఫొటోను పంచుకున్న షమి ‘చాక్లెట్‌ లవర్‌.. మిస్‌ యు బెబో' అని పేర్కొన్నాడు. షమి చేసిన ఈ ఎమోషనల్‌ ట్వీట్‌ చూసి నెటిజన్లు మద్దతు పలికారు. ‘ఎలాంటి ఆందోళన చెందకు, అంతా మంచే జరుగుతుంది, త్వరలో నీ సమస్యలన్నీ తీరిపోతాయి'అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
రామ్ చరణ్ ఎనర్జీ అదుర్స్: ‘రంగస్థలం’ టైటిల్ సాంగ్ ప్రోమో
<iframe width="600" height="450" src="https://www.youtube.com/embed/XsdbNvZnD70" frameborder="0" allow="autoplay; encrypted-media" allowfullscreen></iframe>

రామ్ చరణ్ ఎనర్జీ అదుర్స్: ‘రంగస్థలం’ టైటిల్ సాంగ్ ప్రోమో

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన 'రంగస్థలం' సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ప్రోమో మంగళవారం విడుదల చేశారు. 37 సెకండ్ల నిడివిగల ఈ ప్రోమో సినిమాపై అంచనాలు మరింత పెంచింది. రామ్ చరణ్ తన ఎర్జిటిక్ స్టెప్పులతో అదరగొట్టాడు. ఈ పాట గురించి తన ఫేస్ బుక్ పేజీలో రామ్ చరణ్ పేర్కొంటూ... 'ఇప్పటి వరకు తన సినిమాల్లో ఇదే బెస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ అని, ఈ పాట మీతో కూడా స్టెప్పులేయిస్తుంది' అంటూ పేర్కొన్నారు. రంగస్థలం చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు.

టీడీపీ-వైసీపీలకు షాక్: 'అవిశ్వాసం అంటే పిల్లలాట కాదు'

టీడీపీ-వైసీపీలకు షాక్: 'అవిశ్వాసం అంటే పిల్లలాట కాదు'

తెలంగాణ సీఎం, తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం మేరకే తాము పార్లమెంటులో ఆందోళనలు చేస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మంగళవారం చెప్పారు. రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు తమ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. లోకసభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీయే ఈ నాటకం ఆడిస్తోందని వస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. తమ పార్టీని ఆడించే సత్తా ఎవరికీ లేదన్నారు. అవిశ్వాస తీర్మానం అంటే పిల్లలాట కాదన్నారు.

పద్మవిభూషణ్ అందుకున్న ఇళయరాజా

పద్మవిభూషణ్ అందుకున్న ఇళయరాజా

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా మంగళవారం పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ముగ్గురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 72 మందికి పద్మశ్రీ పురస్కరాలను ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మ అవార్డు గ్రహీతలు పలువురికి రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 41 మందికి పద్మ పురస్కారాల ప్రదానం జరిగింది. మిగిలిన వారికి ఏప్రిల్ 2న అవార్డులు ప్రదానం చేయనున్నారు.