Short News

నిలకడగా భారత్ బ్యాంటింగ్, రోహిత్ అర్ద సెంచరీ

నిలకడగా భారత్ బ్యాంటింగ్, రోహిత్ అర్ద సెంచరీ

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. రోహిత్ శర్మ అర్ద సెంచరితొ తన సత్తా చాటాడు. 57 బంతుల్లో 50 పరుగులు చేశాడు. శిఖర్‌ ధావన్‌ ఔటైన తర్వాత పరుగుల వేగం మందగించింది. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతున్నారు. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (34; 39 బంతుల్లో 3×4, 2×6) ఆచితూచి ఆడుతూనే బౌడరీలు బాదేస్తున్నాడు. అతడికి విరాట్‌ కోహ్లీ (16; 28 బంతుల్లో 1×4) సహకారం అందిస్తున్నాడు.
అమెరికన్ విద్యార్థులను వెంటాడుతున్న 'కాల్పుల' భయం..

అమెరికన్ విద్యార్థులను వెంటాడుతున్న 'కాల్పుల' భయం..

ఫ్లోరిడా స్కూల్ కాల్పుల ఘటన తర్వాత అమెరికాలోని చాలామంది చిన్నారులు.. ఎక్కడ తమ స్కూల్లో కాల్పులు చోటు చేసుకుంటాయో? అన్న భయాందోళనతో గడుపుతున్నారట. ప్రఖ్యాత అమెరికా పరిశోధనా సంస్థ ప్యూ (పీఈడబ్ల్యూ) సర్వేలో ఈ విషయం వెల్లడైంది.13 నుంచి 17ఏళ్ల వయసున్న విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సర్వేలో 57 శాతం చిన్నారులు తాము చదువుకుంటున్న స్కూల్లోనే ఇలాంటి సంఘటన జరగొచ్చని భావిస్తున్నామని చెప్పారు.

పవన్ వైఖరికి వ్యతిరేకంగా జర్నలిస్టుల నిరసన..

పవన్ వైఖరికి వ్యతిరేకంగా జర్నలిస్టుల నిరసన..

మీడియా సంస్థల పట్ల పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్టు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయుడబ్ల్యూజె) కమిటీ ప్రెసిడెంట్ అల్లం నారాయణ ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. మీడియా స్వేచ్చను కాపాడుకోవడానికి జర్నలిస్టు సంఘాలు సదా సిద్దంగా ఉంటాయని పవన్ కల్యాణ్, ఆయన అభిమానులు గుర్తుంచుకుంటే మంచిదని నోట్ ద్వారా తెలిపారు. పవన్ కల్యాణ్ వైఖరికి నిరసనగా ఏప్రిల్ 21 నాటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టుల నిరసన కార్యక్రమం ఉంటుందని ప్రకటించారు.

పవన్ కల్యాణ్ పై  ఆర్కే రూ.10కోట్ల పరువు నష్టం దావా..

పవన్ కల్యాణ్ పై ఆర్కే రూ.10కోట్ల పరువు నష్టం దావా..

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పరువు నష్టం దావా వేయబోతున్నారు. తనపై కుట్ర పన్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలను ఆయన న్యాయ పోరాటం ద్వారా ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై క్రిమినల్ కేసుతో పాటు రూ.10కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్టు సమాచారం.

కాగా, శ్రీరెడ్డి తన తల్లిని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను పదేపదే ప్రసారం చేశారని పవన్ చేసిన ఆరోపణలను ఏబీఎన్ ఖండించింది. తమ ఛానెల్ జర్నలిజం విలువలను పాటించిందని, ఆ బూతు పదాన్ని మ్యూట్ చేశాకే ప్రసారం చేశామని వివరణ ఇచ్చింది.