Short News

రోహిత్ సఫారీ గడ్డపై పరుగులు చేయలేడు

రోహిత్ సఫారీ గడ్డపై పరుగులు చేయలేడు

టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ సఫారీ గడ్డపై పరుగులు చేసేందుకు తడపడుతున్నాడు.ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పిచ్ లపై ప్రతాపం చూపిన రోహిత్  ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో మాత్రం ఘోరంగా విఫ‌ల‌మ‌వుతున్నాడు. రోహిత్‌కు ఇది మూడో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌. అయితే రోహిత్ విఫలమవ్వటానికి కార‌ణం అత‌ని పుట్‌వ‌ర్కేన‌ని ద‌క్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ కెప్ల‌ర్ వెస్స‌ల్స్ వ్యాఖ్యానించాడు. ద‌క్షిణాఫ్రికాలో ఆఫ్‌సైడ్ ఆడేట‌పుడు అత‌ని స్టాన్స్ సరిగా ఉండ‌డం లేదన్నాడు.
రెండో టీ20లో సత్తా చాటిన సఫారీలు

రెండో టీ20లో సత్తా చాటిన సఫారీలు

భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో సఫారీలు దూకుడుగా ఆడి విజయం సాధించారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా మనీష్ పాండే, ధోనీల దూకుడుతో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. లక్ష్యచేధనలో దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ (69) కెప్టెన్ డుమిని (64)ల ధాటికి 18.4 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో సఫారీలు 1-1తో సిరీస్ సమం చేసారు.
బుందేల్ ఖండ్‌పై మోడీ వరాల జల్లు..

బుందేల్ ఖండ్‌పై మోడీ వరాల జల్లు..

ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్‌పై బుధవారం ప్రధాని మోడీ వరాల జల్లు కురిపించారు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం రూ.20 వేల కోట్ల ప్యాకేజ్‌తోపాటు రక్షణ పారిశ్రామిక కారిడార్‌ను కూడా ఆయన ప్రకటించారు. బుధవారం లక్నోలో నిర్వహించిన ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్-2018 కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రక్షణ కారిడార్ కేటాయింపుతో రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని మోడీ చెప్పారు.

ఈ ఏడాది పెళ్ళి చేసుకోనున్న 'రోబో' సుందరి

ఈ ఏడాది పెళ్ళి చేసుకోనున్న 'రోబో' సుందరి

నటి అమీ జాక్సన్‌ బ్రిటన్‌కి చెందిన వ్యాపారవేత్త జార్జితో పెళ్ళిపీటలెక్కబోతోంది. వ్యాలెంటైన్స్‌ డే రోజున అమీ ప్రియుడితో కలిసి ఉన్న ఫొటో పోస్ట్‌ చేయడంతో ప్రేమ విషయం అందరికీ తెలిసింది. ఈ ఏడాదిలోనే వీరిద్దరూ పెళ్ళిచేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. గతేడాదే వీరిద్దరి పెళ్ళి జరగాల్సి ఉండగా అమీ సినిమాలతో బిజీగా ఉండడంతో వాయిదా వేసినట్లు సమాచారం. అమీ జాక్సన్‌ ప్రస్తుతం '2.0 సినిమాతో బిజీగా ఉంది.