Short News

రితికకు రోహిత్‌ శర్మ 'వాలైంటైన్స్‌ డే' కానుక

రితికకు రోహిత్‌ శర్మ 'వాలైంటైన్స్‌ డే' కానుక

భారత క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భార్య రితికను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం నాడు రితికకు ఏం కానుక ఇచ్చాడో తెలుసా. పోర్ట్‌ఎలిజబెత్‌లో మంగళవారం భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఐదో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ శతకం సాధించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.  ఆ ట్రోఫీతో తీసుకున్న ఫోటోను ఇన్‌స్టాగ్రాంలో ‘హ్యాపీ వాలైంటైన్స్‌ డే రిట్స్‌' అని చెప్తూ షేర్ చేసాడు.  
అదేపనిగా 'గ్యాస్' వదులుతూ విమానాన్ని దించేసాడు

అదేపనిగా 'గ్యాస్' వదులుతూ విమానాన్ని దించేసాడు

దుబాయ్ నుంచి ఆమ్‌స్టర్ డామ్ వెళుతున్న విమానంలో ఒక ప్రయాణికుడు అపాన వాయువును వదలడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసారు. ట్రాన్సావియా ఎయిర్‌లైన్స్ హెచ్‌వీ 6902 ఫ్లయిట్‌లో ఒక ప్రయాణికుడు అత్యధిక మోతాదులో గ్యాస్ విడుదల చేయటంతో తోటి ప్రయాణికులంతా కంట్రోల్ చేసుకోమని చెప్పారు. అతనికి అది సాధ్యం కాకపోవటంతో వివాదం మొదలై విమానాన్ని అత్యవసరంగా సురక్షిత ప్రాంతంలో ల్యాండ్ చేసారు. 
ప్రియాంక దారుణమైన క్లీవేజ్ షో..భరించలేకపోతున్న ఎమ్మెల్యేలు..మంచి పని కోసమే!

ప్రియాంక దారుణమైన క్లీవేజ్ షో..భరించలేకపోతున్న ఎమ్మెల్యేలు..మంచి పని కోసమే!

ప్రియాంక ఎంతటి అందగత్తో అంతే స్థాయిలో ఆమె చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. అస్సాం టూరిజం కోసం ప్రియాంక చేసిన ఫోటో షూట్ తీవ్రమైన కాట్రవర్సీకి దారితీసింది. ఇప్పుడు ఈ చర్చే సర్వత్రా జరుగుతోంది. ఆ మధ్యన భారత ప్రధాని మోడీ ముందు పొట్టి బట్టలతో కూర్చున్న ఘటన విమర్శలకు దారి తీసింది. అస్సాం టూరిజం క్యాలండర్ కొరకు ప్రియాంక చేసిన ఫోటోషూట్ తీవ్రమైన కాంట్రవర్సీకి కారణం అయింది. పీసీ ఆ ఫోటో షూట్ లో మునుపటికంటే హాట్ హాట్ గా క్లివేజ్ షో తో చెలరేగిపోయింది.

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళకు 'ఐదేళ్ళు'

దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ళకు 'ఐదేళ్ళు'

దిల్‌సుఖ్‌నగర్‌లో జంటపేలుళ్ళకు నేటికి ఐదేళ్ళు. ఈ నేపధ్యంలో దిల్‌సుఖ్‌నగర్, ఆ పరిసరాల్లో పోలీసులు బందోబస్తు పెంచారు. 2013, ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి కోణార్క్ థియేటర్ సమీపంలో రెండు చోట్ల బాంబులు పేలాయి. ఈ పేలుళ్ళలో 19 మంది మృత్యువాత పడటంతో పాటు 120 మంది గాయపడ్డారు. ఈ కేసులో 2016, డిసెంబర్ 19వ తేదీన ఐదుగుర్ని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం, ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.